Home News Politics

రోజా పై మిసైల్ ని సిద్దం చేస్తున్న నారా వారు….!

సొంత జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఒక్కో చిక్కుముడి విప్పుతున్నారు. జిల్లాలో పట్టు కోసం సీరియస్ గా ట్రై చేస్తున్న టీడీపీ అధినేత గతంలో లాగా కాకుండా ఎన్నికల అరు నెలల ముందు జిల్లాలో అభ్యర్థులను వ్యూహాత్మకంగా ఖరారు చేస్తున్నారు. జిల్లాలో పచ్చ జెండా పాతడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇప్పటికే చంద్రగిరి,పుంగనూరు లలో అభ్యర్థులను ప్రకటించగా ఇదే ఊపులో నగరి ,మదనపల్లిలో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తుండగా అదంతా సులువు కాదంటు పార్టీకి అగ్నీ పరీక్ష పెడుతున్నారు అశావహులు,దీంతో ఈరెండు సీట్ల పీట ముడి విప్పడానికి సర్వేల పేరుతో హాడావుడి ప్రారంభించింది  టిడిపి అదిష్టానం.

సొంత జిల్లాలో గత ఇరవై సంవత్సరాలుగా అదిపత్యం ప్రతిపక్ష పార్టీలదే కావడంతో ఈసారి దానిని బ్రెక్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.గత నాలుగు వరుస ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్,వైసిపిలు మెజార్టీ సీట్లు సాదించడంతో స్వంత జిల్లాలో అధినేతకు పట్టు లేదని ఇతర జిల్లాలనుంచి విమర్శలు తప్పించడానికి గట్టి కసరత్తు మొదలు పెట్టారు.పార్టీ పరంగా బలంగా ఉన్నప్పటికి అభ్యర్థులు  ఎంపిక ప్రతిసారీ పార్టీ దెబ్బతినడానికి కారణమవుతుంది.గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన పంచాయితీ,మున్సిపాలిటి ,జడ్పీ ఎన్నికల్లో టిడిపి అదిక్యత సాధించగా ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రం అనుహ్యంగా ఓటమి పాలయింది.ఈదశలో ఈసారి అలాంటి పలితాలు పునారావృతం కాకుండా సీరియస్ గా అరు నెలలకు ముందు అభ్యర్థుల వేటలో బిజీగా వున్నారు చంద్రబాబు.ఇప్పటికే తన స్వంత నియోజవకర్గం అయిన చంద్రగిరికి పులివర్తి నాని,పుంగనూరుకు మంత్రి అమరనాథ్ రెడ్డి మరదలు అనూషాను ప్రకటించారు.

అయితే మరో రెండు నియోజకవర్గాలు ఇప్పుడు అధినేతకు పరీక్షగా మారాయి.అవి రెండు గతంలో టిడిపి కంచుకోటలు కాగా చిన్న చిన్న తప్పిదాలతో ప్రత్యర్థుల ఖాతాలో పడ్డాయి.నగరికి సంబంధించి మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణించగా  అక్కడ నాయకత్వం ఎంపిక ఇప్పుడు పరీక్షగా మారింది.గాలి కుటుంబ సభ్యుల తీరు పార్టీకి ఇబ్బందిగా మారింది.ప్రజలలో లేని వ్యక్తిని గాలి సతీమణి ఎంఎల్ సి సరస్వతి సిపార్స్ చేస్తుండగా పెద్ద కూమారుడు గాలి భాను ప్రకాష్ మాత్రం అమి తుమీ తెల్చుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

నగరిలో తనకు పట్టువుందని అధినాయత్వానికి తెలపడానికి వీలుగా గాలిబాను ప్రకాష్ ఈమద్య కాలంలో నియోజకవర్గం మొత్తం గ్రామాల వారీగా పర్యటన చేశాడు.తాజాగా నిన్న 10 వేల మందితో బారీ ర్యాలీ నిర్వహించి ఎంఎల్ఎ రోజా పై నిప్పులు చెరిగాడు. చంద్రబాబుకు సంఘీభావంగా యువనేత లోకేష్ బాబు ప్రతిష్టాత్మకంగా  తీసుకున్న యువనేస్తం విజయ వంతం అయినందుకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెబుతున్నాడు.అయితే నిజానికి నియోజకవర్గంలో తనకు పట్టువుందని కుటుంబ సభ్యుల సహాకారం లేకున్నప్పటికి తాను బరిలో వుండగలలని చెప్పడానికి ఈర్యాలీ నిర్వహించినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే మొత్తానికి గాలి భాను ప్రకాశ్ ఈర్యాలీతో జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా  మారింది.అయితే ఇదే నియోజకవర్గంలో  మరో వ్యక్తిని రంగంలో దింపడానికి ఓవర్గం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.దీంతో పాటు గతంలో గాలికి వ్యతిరేఖంగా పనిచేసిన బ్యాచ్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.కాని గాలి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వక పోతే జిల్లాలో దాని ప్రభావం వుండే అవకాశం వుందని ముఖ్యంగా జీడినెల్లూరు,సత్యవేడు ,చంద్రగిరి ,తిరుపతి అర్బన్ నియోజకవర్గాలలో వున్న గాలి అనుచరులు వల్ల ఇబ్బందులు గురించి పార్టీ అలోచిస్తున్నట్లు సమాచారం.

ఇక మదనపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్  అవకాశాలు గండి కొట్టడానికి ప్రత్యర్థి వర్గం తీవ్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇద్దరు మాత్రమే రంగంలో వున్నారని ప్రచారం జరిగింది.మాజీ ఎమ్మెల్యే రమేష్ తో పాటు రామ్ దాస్ చౌదరి పేర్లు తీవ్రంగా వినిపించినప్పటికి ఇప్పుడు బొడేపూడి శ్రీనివాసులు కూడా సీరియస్ గా తన వంతు ప్రయత్నాలు ప్రారంబించాడు.
గతంలో  మూడున్నర  సంవత్సరాల పాటు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా వుండి అర్థికంగా సైతం ఖర్చులు భరించిన తనను ఇప్పడున్న జిల్లా నాయకత్వం కావాలని తనను పక్కన పెట్టిందని అయన  వర్గం అరోపిస్తుంది.ఈపరిస్థితుల్లో తాను బరిలో లేననే ప్రచారం కావాలని రెండు వర్గాలు కలసి దుష్రచారం చేస్తున్నాయని ఈవిషయాలన్ని సియం వరకు తీసుకు పోవడానికి సిద్దంగా వున్నట్లు అంటున్నారు.అంతకు ముందు నియోజకవర్గంలో తన బలనిరూపణ కోసం బారీ ఎత్తున ర్యాలీ,బహిరంగ సభ నిర్వహించడానికి  ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇక్కడ కూడా యువనేత లోకేష్ బాబు  మన్ననలు పొందడానికి వీలుగా యువనేస్తం విజయం వంతం అయిదంటు నియోజకవర్గంలోని యువకులను సమీకరించి కార్యక్రమాలు నిర్వహించానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇందుకు గాను బిసి వర్గాలను కలుపుకు పోవడానికి వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇక్కడ ఇప్పటికే అభ్యర్థి ఖరారు ఇక ప్రకటనే తరువాయి అన్న ప్రచారం జరుగుతున్న నేపద్యంలో మరో తల నొప్పి మొదలయిందంటు జిల్లా నాయకత్వం అందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

సొంత జిల్లా నుంచి అభ్యర్థుల ప్రకటన మొదలు పెట్టిన సియంకు ఇక్కడే అటంకాలు ఏర్పడ్డంతో అయన సీరియస్ గా ఈవిషయంలో వున్నట్లు సమాచారం.ముఖ్యంగా ఈసారి చంద్రగిరి,నగరి,మదనపల్లి నియోజవర్గాలలో టిడిపి ఖచ్చితంగా విజయం సాదించాలని అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక వుంటుందని ఈదిశలో ఎవ్వరు అడ్డంకులు సృష్టించిన ఉపేక్షించనని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.స్వంత జిల్లా కావడంతో అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా వుంటాయని శ్రేణులను హెచ్చిరించినట్లు తెలుస్తోంది.మొత్తం మీదా జిల్లాలో ఓ నెలలో ఎన్నికల వేడి మొదలయ్యేటట్లు అవకాశాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here