Home Entertainment Cinema

రోబో 2.ఓ అంచనాలు అందుకోలేదా…?

గత ఎనిమిది నెలలుగా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సినిమా రోబో 2.ఓ. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు ఈ సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్, యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీకి అభిమానుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. బాహుబలిని మించి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కొన్నాళ్ళుగా గ్రాఫిక్స్ పేరుతో వాయిదా పడుతూ ఉంది.

ఒక సినిమాకి భారీ హైప్ క్రియోట్ అయినా అది ఆ సినిమా పై నెగిటివ్ రిజల్ట్ కి దారి తీస్తుంది. అలాంటి పరిస్థితే రోబో 2.ఓ ది. సినిమా పై ప్రేక్షకుడి అంచనాలు ఏ మాత్రం తగ్గినా అది ఆ సినిమా పై ఓ రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. రజనీ,శంకర్ ఇమేజ్ ని ఒక ఎత్తులో నిలబెడుతుందనుకున్న ఈ సినిమా ఎక్కడో తేడా కొట్టింది. ఎంత స్టార్ డైరక్టర్ శంకర్ అయినా కథ,స్క్రీన్ ప్లే విషయంలో దృష్టి పెట్టకపోతే అదే మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టం.


గ్రాఫిక్స్ తోనే సినిమాని లాగించేయడం అది అన్నివేళలా సాధ్యం కాదు. రోబో తో పోల్చుకుంటే ఇందులో హాస్యం పాళ్ళు తక్కువే. అందులో ఉన్న యాక్షన్ ,ఎమోషన్స్ ఇందులో మచ్చుకైన కనపడవు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే రోబో పాటలు కొంత మంది నోట్లో హమ్ చేస్తు వినపడ్డాయి కానీ ఈ సీక్వెల్ విషయంలో మాత్రం అది ఒక్కరికి అర్ధంకాని మిస్టరీలా ఉంది. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు. ప్రేక్షకున్ని మెస్మరైజ్ చేసే రీతిలో ఉంది. రోబో విషయానికి వస్తే చిన్న పొరపాటు జరిగిన మనిషికే రోబోలు విలన్లుగా మారతాయి అన్నది కాన్సెప్ట్. ఇందులో తీసుకున్న కాన్సెప్ట్ అంత కన్విన్స్ చేసేలా లేదు.


సెల్ ఫోన్ రేడియోషన్ పై ఎప్పటి నుంచో అపోహలున్నా అది ప్రాణాంతకమైన ప్రమాదం ఏం కాదు. ప్రస్థుతం స్మార్ట్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారిన తరుణంలో వీటి రేడియోషన్ పక్షుల మరణానికి కారణం అవుతుందన్న చిన్న కాన్సెప్ట్ తో కథ నడిపించడం ఆకట్టుకోలేక పోయింది. మరణించిన పక్షుల ఆత్మలన్ని కలిసి విధ్వంసన్ని మొదలుపెట్టడమే ఈసినిమాలో ఉన్న ట్విస్ట్. ఫిక్షన్ కమ్ సైన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ కాన్సెప్ట్ లో ఎక్కడో కంటెట్ మిస్ అయుతుందన్న ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపు సగటు ప్రేక్షకున్ని కన్ ఫ్యూజ్ చేస్తుంది.


అసలు మళ్ళి ఇలాంటి ఎఫెక్ట్స్ చూస్తామా అనే రేంజ్ లో అత్యున్నత సాంకేతిక ప్రతిభ అడుగడుగునా కనిపించినప్పటికీ ఎక్కడో చిన్న థ్రెడ్ మిస్ అయిన ఫీలింగ్ మధ్యమధ్యలో కలుగుతూనే ఉంటుంది. ఎంత వద్దన్నా రోబో సీక్వెల్ కాబట్టి పోలిక రావడం సహజం. 2.0 ఇక్కడే కొంత నిరాశ చెందే ఛాన్స్ ఇచ్చింది. మొదటి సారి చిట్టి భారీ పిచ్చుక రూపంలో ఉన్న పక్షి రాజుతో ఫైట్ మాత్రం అలాగే కళ్ళప్పగించి చూసేలా అనిపిస్తుంది. ఏదేమైనా ప్రమోషన్ లో శంకర్ చెప్పినట్టుగా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో తాను పూర్తి సంతృప్తి చెందలేదు అన్న మాట కొన్ని సీన్స్ లో నిజమే అనిపిస్తుంది. కాకపోతే స్టొరీ పరంగా ప్రతి సారి రోబో మేజిక్ రిపీట్ చేయడం సాద్యం కాదు కాబట్టి విడిగా శంకర్ ప్యాషన్ కి మాత్రం సెల్యూట్ చేయోచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here