Home News Stories

హోంమంత్రిగా రోజా! ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులయ్యేది వీరేనా? సోషల్ మీడియాలో హల్ చల్

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. మండలి రద్దుపై అసెంబ్లీయే సిఫార్సు చేసిన నాటి నుంచి మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు పౌ ఊహాగానాలు పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో హోంమంత్రి అవుతారంటూ నగరి ఎమ్మెల్యేలే రోజా విషయంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

డీజీపీ కార్యాలయానికి వెళ్లిన రోజా. తాజా పరిస్థితులపై చర్చ! రోజాకు మంత్రి పదవిపై ఊహాగానాలు.. అంటూ టీవీ ఛానెల్స్ హోరెత్తిస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. తాజా పరిస్థితులపై ఆమె డీజీపీతో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, ఏపీలో మారిన పరిణామాల నేపథ్యంలో రోజాకు మంత్రిపదవి ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. మండలి రద్దు నేపథ్యంలో, మండలి నుంచి మంత్రిగా పదవులు దక్కించుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామా అనివార్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, రోజా క్యాబినెట్ లో ప్రవేశించడం తథ్యమంటూ ప్రచారం జరుగుతోంది.

మండలి రద్దు తర్వాత కొత్తగా తెరమీదకు వస్తున్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

దర్మాణ ప్రసాద్ కి..స్పీకర్

తమ్మినేని కి మంత్రి పదవి

రోజా కు హోం మంత్రి.. ఇచ్చే అవకాశం… మంత్రి వర్గం పై కసరత్తులు