Home Entertainment Cinema

దిశ ఎన్‌కౌంటర్‌ ! వద్దంటే వింటే వర్మ ఎందుకవుతాడు?

రాంగోపాల్‌వర్మ అంటే ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్‌. టాలీవుడ్‌లో శివ, బాలీవుడ్‌లో సర్కార్‌లాంటి సిన్మాలతో తన మార్క్‌ చూపించిన దర్శకుడు. కానీ ఇప్పుడు వర్మంటే న్యూసెన్స్‌. వర్మంటే వివాదం. క్రియేటివిటీ ఎప్పుడో మూసీలో కలిపేసి కేవలం వాస్తవ కథల ఆధారంగా సినిమాలు చుట్టేయడానికి అలవాటుపడ్డాడు రాంగోపాల్‌ వర్మ. పోనీ అవేమన్నా బాలీవుడ్‌ స్థాయిలో మనసుపెట్టి తీస్తున్న బయోపిక్‌లా అంటే..అదీ కాదు. సంచలనం సృష్టించిన సంఘటనలకు నాలుగు క్యారెక్టర్లను పెట్టేసి నచ్చిన డైలాగులు రాసేసి జనంమీద రుద్దేస్తున్నాడు వర్మా ది గ్రేట్‌.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశకేసు ఇప్పుడు వర్మకు వాణిజ్య సరుకై కూర్చుంది. టోల్‌గేట్‌ దగ్గర టూవీలర్‌ పెట్టి, కామాంధుల ట్రాప్‌లో చిక్కి, దారుణ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్‌ ఘటనని బేస్‌చేసుకుని వెంటనే సిన్మా ఎనౌన్స్‌ చేశాడు వర్మ. ఆ యువతిపై అత్యాచారంచేసి హతమార్చిన నలుగురు కామాంధులను ఆ స్పాట్‌కి దగ్గర్లోనే ఎన్‌కౌంటర్‌చేశారు పోలీసులు. వరంగల్‌ ఘటన తర్వాత మళ్లీ అంతటి సంచలనం సృష్టించింది దిశ ఎన్‌కౌంటర్‌. యావత్‌ సమాజం దాన్ని ఆహ్వానించింది. తక్షణ శిక్ష పడినందుకు సంతృప్తిచెందింది. ఇంత డ్రామా ఉన్న సంఘటన దొరికాక వర్మ వదులతాడా..దిశ ఎన్‌కౌంటర్‌ పేరుతో సిన్మా మొదలుపెట్టేశాడు. ఈనెల్లోనే తొందరగా జనంమీదికి వదలాలని ఆరాటపడుతున్నాడు

చిరునవ్వుతో కళ్లెదుట తిరిగే కూతురు కాలిని కట్టెలా తిరిగొస్తే తల్లడిల్లిన తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే ఆ బాధనుంచి కోలుకుంటున్నారు. ఈ సమయంలో గాయంపై కారం చల్లేలా వర్మ సిన్మా తీస్తుండటం కన్నవారిని ఆవేదనకు గురిచేస్తోంది. వర్మ రిలీజ్‌ చేసిన దిశ ఎన్‌కౌంటర్‌ టీజర్‌తో బాధితురాలి పేరెంట్స్‌కి అభ్యంతకరమైన మెసేజ్‌లు అందుతున్నాయి. దీంతో వర్మ సిన్మాని అడ్డుకోవాలంటూ కోర్టుకెక్కారు దిశ పేరెంట్స్. వెంటనే టీజర్‌ని తొలగించాలని, ఈనెల 26న విడుదల చేయాలనుకుంటున్న దిశ ఎన్‌కౌంటర్‌ సిన్మాని ఆపాలని కోరుకుంటున్నారు. నా మాట నేనే వినననే వర్మలాంటి సైకో డైరెక్టర్‌కి…కూతురుని పోగొట్టుకున్న కన్నవారి కడుపుమంట ఎలా తెలుస్తుంది. జనం జీవితాలతో ఆడుకోకుండా…సొంత స్టోరీతో వర్మ సిన్మా తీస్తాడని ఆశించడం అత్యాశే కదూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here