Home News

టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక..రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా..?

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ఓ ప్రహసనంలా మారింది. ఇన్నాళ్లు…పార్టీ ఓటములన్నీ పిసిసి చీఫ్‌గా ఉత్తమ్ ఖాతాలోనే పడిపోయాయ్. గ్రేటర్ ఎన్నికల తర్వాత పిసిసి పదవికి రాజీనామా చేశారు ఉత్తమ్. అప్పటికి ప్రక్రియ మొదలుపెట్టడానికి కొంత టైం పట్టింది. ఆలస్యంగా ఎంపిక మొదలుపెట్టినా…కొత్త చీఫ్ వచ్చేసినట్టే అని ప్రచారం జరిగిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ కదా…ఇక్కడ ఏదైనా సాధ్యమే అన్నట్టు…మేడం అప్రూవల్ అయినా…నాగార్జున సాగర్ ఎన్నికల వరకు పిసిసి నియామకానికి బ్రేక్ అని ఇంఛార్జి ఠాగూర్ ప్రకటించారు. ఇక మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఇంఛార్జి చీఫ్ యాక్టివ్ అవ్వట్లేదు. కొత్త చీఫ్ ఎన్నికా జరగట్లేదు. ఓ వైపు క్యాడర్ అంతా గందరగోళంలో ఉంటే…అధ్యక్షుడి ఎంపిక పై అధిష్టానం మరింత గందరగోళం చేస్తుంది.

నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఇంఛార్జి ఠాగూర్‌ని కొందరు పార్టీ నాయకులు కలిసి పిసిసి విషయం పై అడిగారు. ఎన్నికలు అయిపోగానే మూడు..నాలుగు రోజుల్లో మేడంకు నివేదిక ఇస్తా అని చెప్పారట. ఇప్పటికీ నివేదిక ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ తర్వాత రాహుల్ కరోనా బారినపడ్డారు. మేడంకి నివేదిక ఇచ్చినా…వెంటనే ప్రకటన చేస్తారా..అనేది కూడా డౌటుగానే ఉంది. ఠాగూర్ నివేదిక ఎలా ఉంటుందీ అనేది కూడా మరో సందేహం. సాగర్ ఎన్నికల కంటే ముందు..జరిగిన ప్రక్రియలో.ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిసిసి అయిపోయారనే టాక్ నడిచింది. కానీ ఆఖరి నిమిషంలో అది కాస్తా ఆగిపోయింది. ఇప్పుడు ఠాగూర్ ఇచ్చే నివేదిక…జీవన్ రెడ్డి పేరుతోనే ఉంటుందా..లేదంటే కొత్త పేరు ప్రతిపాదన ఉంటుందా అనే దానిపై చర్చ నడుస్తుంది.

పిసిసి చీఫ్ రేసులో ఇప్పటికే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆఖరి వరకు కూడా ఇద్దరూ ప్రయత్నం చేశారు. సాగర్ ఎన్నికల తర్వత కూడా రేవంత్…కోమటిరెడ్డిలు ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా మద్దతు దారులు మాత్రం ఏదో ఒక రూపంలో ఇష్యూ నీ లైవ్‌లో ఉంచుతున్నారు. ఇప్పటికే రేవంత్ పార్టీలో చాలా మంది సీనియర్లను తన ఖాతాలో వేసుకున్నారు. పైగా ఇంచార్జ్ ఠాగూర్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు తనకు ప్లస్ అవుతాయని లెక్కలేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి గెలిస్తే ఏఐసీసీలో ఆయన చక్రం తిప్పడం మాత్రం ఖాయం. ఆయన జోక్యం చేసుకుంటే…తాను అనుకున్న వారికి పిసిసి ఇప్పించి తీరుతారనే టాక్ కూడా పార్టీలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here