Home News

కేసీఆర్ కుటుంబం భూ కబ్జాల చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి

ఈటెలకు తరహలోనే మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. భూ కబ్జాల్లో అసలు దొంగలు సీఎం కేసీఆర్ ఇట్లోనే ఉన్నారన్నారు రేవంత్. నియోజకవర్గమైన శామీర్ పేట మండలంలోని, దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై సంచలన ఆరోపణలు చేశారు. దేవరయాంజాల్ రామాలయం భూముల్లో కేసీఆర్, కేటీఆర్ కు భూములున్నాయని తెలిపారు. సేల్ డీడ్ కేటీఆర్ పేరు మీద ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ లీడర్లకు భూములు ఉన్నాయని సర్వే నెంబర్ 658 మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకున్నారని.. 7ఎకరాల్లో మంత్రి మల్లారెడ్డి ఫాం హౌజ్ కట్టుకున్నారని చెప్పారు. .. నమస్తే తెలంగాణ పేపర్ ఎండీకి కూడా ఇక్కడ భూములు ఉన్నాయన్నారు. మల్లారెడ్డి, కేటీఆర్ పోటీపడి ఫాంహోజ్ లు కట్టుకున్నారని.. దేవుడి పేరు మీదున్న భూములపై బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here