Home Videos

పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఖరారు..వర్కింగ్ ప్రెసిడెంట్లు వీరే ?

తెలంగాణ కాంగ్రెస్‌లో పిసిసి పై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. పీసీసీ చీఫ్ పదవి కావాల్సిందే అని పట్టు పడుతున్న వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి…రేవంత్ రెడ్డి ముందున్నారు. వీరితో పాటు శ్రీధర్ బాబు,జీవన్ రెడ్డి సైతం రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఇప్పుడున్న పరిస్థితిలో మాస్ లీడర్ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంఛార్జి టాగూర్, ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌.. అదిష్టానానికి ఇచ్చిన నివేదికలోనూ ఇదే స్పష్టం చేశారని తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరనే దాని పై ఇంఛార్జి మనసులో ఓ నాయకుడి పేరు.. ఇక్కడి సీనియర్ల మనసులో మరో నాయకుడి పేరు ఉంది.

టీపీసీసీ పోస్ట్ రేవంత్ కి అప్పగిస్తేనే పార్టీ దూకుడుగా వెళ్తుందని..సీఎం కేసీఆర్ పై గట్టిగా పోరాడగలమని మెజార్టీ డీసీసీ అధ్యక్షులు సైతం పార్టీ ఇంచార్జ్ ఠాగూర్ కి తెలిపారు. రేపటిలోగా పీసీసీ నేత పేరు ప్రకటించే అవకాశం ఉండటంతో నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సీనియర్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆఖరుకి రేవంత్ పేరే ఖారారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here