టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం పై పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హార్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడుగా డిక్లేర్ చేయడంతో సీనియర్ కాంగ్రెస్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు.
రేవంత్ కి టీపీసీసీ పై అధిష్టానం జాప్యం చేయడంతో పార్టీకి దూరమయ్యారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తాజాగా రేవంత్ కి పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంతో కొండా మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.