Home News Updates

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.

ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించింది. ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు. సీనియర్‌ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్‌, గోపీశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌రావు, జావెద్‌ అమీర్‌‌లను ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here