Home Health corona

ఆనందయ్య మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

కొన ఊపిరితో ఉండి ఆనందయ్య మందు తీసుకుని కోలుకున్నా అని చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కోలుకున్న కోటయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటివరకు ఆక్సీజన్ సిలిండర్ సహాయంతో చికిత్స పొందిన కోటయ్య ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంలో జీజీహెచ్ కి తరలించారు కుటుంబసభ్యులు.

కొన ఊపిరితో ఉన్న కోటయ్యకు ఆనందయ్య మందు కంటిలో వేసిన తర్వాత కోలుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న తనకు ఈ మందు బాగా పని చేసిందని మీడియాకు తెలిపాడు కోటయ్య. ఆ తర్వాత రెండు రోజులకు కోటయ్య ఆక్సీజన్ లెవల్స్ పడిపోయి అస్వస్థతకు గురయ్యారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో కుటుంబ స‌భ్యులు వారం క్రితం ఆయ‌న్ను నెల్లూరు జీజీహెచ్‌లో చేర్పించారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here