ఒకటి రెండు కాదు ఏకంగా 11 ఏళ్ల విరామం తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సినిమాలో ఈమె పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇక సినిమాలకు సెలవు అని ట్వీట్ చేసింది విజయశాంతి. ఇది చూసి అంతా షాక్ అయిపోయారు.

అదేంటి ఇకపై సినిమాలు చేస్తాను అని చెప్పిన విజయశాంతి ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అంతా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారు. అయితే దీనికి కారణం మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా విజయం సాధించినా ఇందులో విజయశాంతి పోషించిన పాత్రకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తే.. ఆమె పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అనుకున్నారు అభిమానులు. కానీ వాళ్లు ఊహించిన దానికంటే చాలా తక్కువ ఉంది అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి పాత్ర పోషించడానికి విజయశాంతి ఎందుకు.. రమ్యకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు కదా.. మరీ అంత ప్రత్యేకంగా పట్టుబట్టి విజయశాంతి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటూ కొందరు బాహాటంగానే విమర్శించారు.
- వచ్చే ఎన్నికల కోసం సిట్టింగ్ లకు ఎర్త్ పెడుతున్న టీఆర్ఎస్ నేతలు వీరే…!
- అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి.. ఆ పై బెదిరింపులు..కడపలో ఏంజరుగుతుంది…?
- టీఆర్ఎస్ లో మరో ఎమ్మెల్యేకి కౌంట్ డౌన్ స్టార్ట్…!
- కేబినెట్ బెర్త్ పై గురిపెట్టిన వైసీపీ సీనియర్లు..వీరిలో చాన్స్ ఎవరికో..?
- ఆ సీనియర్లందరిని పక్కన పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్..రేవంత్ కి ఫుల్ పవర్స్
ఒకప్పుడు విజయశాంతి చేసిన పాత్రలతో పోలిస్తే సరిలేరు నీకెవ్వరు ఈమె చేసిన క్యారెక్టర్ అంత గొప్పది ఏం కాదు. దాంతో ఈ తరం దర్శకులు తనకోసం ఇలాంటి కథలు తప్ప ఇంతకంటే గొప్ప కథలు తీసుకురాలేరని విజయశాంతి ఫిక్స్ అయిపోయిన తరువాత సినిమాలకు దూరం కావాలని ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈమె సినిమాలు చేయాలంటే పారితోషికం కూడా భారీగానే డిమాండ్ చేస్తోంది. హీరోకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తనకు కూడా అవే కావాలని నిర్మాతలను ఈమె అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంత ఇవ్వడానికి ఏ నిర్మాతలు సిద్ధంగా లేరు. ఇలాంటి సమయంలో అనవసరంగా చిన్నచిన్న పాత్రలు చేసి ఉన్న ఇమేజ్ పాడు చేసుకోవడం ఇష్టం లేక విజయశాంతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.