Home Entertainment Cinema

దిల్ రాజు రెండో పెళ్ళికి అసలు కారణాలు కావాలా నాయనా?

ఇండస్ట్రీలో రెండో పెళ్లి అనేది కామన్.. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు దీనిపై వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ అగ్ర నిర్మాత కూడా రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఆయన త్వరలోనే రెండోసారి పెళ్లి కొడుకు కాబోతున్నాడనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈయన తిరుగులేని నిర్మాత. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తే హిట్ అనే నమ్మకం వచ్చింది. ఒకప్పుడు రామానాయుడు, అల్లు అరవింద్, సురేష్ బాబులా ఇప్పుడు ఆయన ఏలేస్తున్నాడు.

సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితంలో మూడేళ్ల కింద ఓ కుదుపు వచ్చింది. అదే ఆయన భార్య మరణం. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న వాళ్ళ కాపురం ఆమె మరణంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది సదరు నిర్మాత జీవితం. అనారోగ్యంతో ఆయన భార్య చనిపోయింది. కొన్నాళ్లు ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోయారు ఆ నిర్మాత. ఇప్పటికీ తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు ఈయన. ఈ దంపతులకు ఒకే కూతురు కూడా ఉంది. ఆమెకు పెళ్లి అయిపోయింది.. ఆ నిర్మాత తాత కూడా అయ్యాడు. అయితే ఇప్పుడు ఈయన ఒంటరిగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

దాంతో ఈయన కూడా మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే త్వరలోనే రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నిర్మాతకు పెళ్లి చేసుకోవాలని లేకపోయినా కూడా తోడు కోసం తప్పడం లేదని ప్రచారం జరుగుతుంది. కచ్చితంగా ఈ వయసులో తోడు ఉండాలని.. అందుకే పెళ్లి చేసుకుంటే తప్పేం లేదని వాళ్లు చెప్పడంతోనే ఈయన ఒప్పుకున్నాడని.. లేదంటే పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యంతో లేడని కొందరు చెబుతున్న మాట. ఏదేమైనా కూడా ఈయన రెండో పెళ్లి వార్త మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here