Home News

కేసీఆర్ జనంబాట పట్టడానికి కారణం ఇదేనా…!

ఉద్యమ సమయంలో వాడీవేడీ స్పీచ్ లు ఇవ్వడం వేరు. సీఎంగా ఉండి.. మాట్లాడటం వేరు. అదే వాడి..అదే వేడి…పంచ్ డైలాగ్స్ లో ఫైర్., ఉల్లాసం కలిగించే చలోక్తులు. చాలారోజుల తర్వాత తన ప్రసంగాల్లో మునుపటి కేసీఆర్ ను గుర్తు చేశారు. ఆకట్టుకునేలా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు తీరు చెప్పారు. రైతుల గోస తీర్చేందుకు ఏం చేస్తున్నామో చెప్పారు. రెవెన్యూ ప్రక్షాళన ఎందుకో చెప్పారు..ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు సంధించారు. ఇంతకీ కేసీఆర్ జనంబాట పట్టడం వెనుక కారణాలేంటి అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

సిద్ధిపేట పర్యటనలో గంటా 20 నిమిషాలు. కామారెడ్డి టూర్లో గంటా 30 నిమిషాలు,వరంగల్ పర్యటనలోనూ అదే ఊపు జిల్లాల పర్యటనలో గతానికి భిన్నంగా సీఎం కేసీఆర్ ప్రసంగాలు సాగాయి. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కేసీఆర్ ఇన్ని గంటలు ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. జిల్లాల్లో విస్త్రతంగా తిరుగుతున్నారు. రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని సమగ్రంగా వివరించారు. వరాలతోనే సరిపెట్టకుండా అమలవుతున్న పథకాలను విపులంగా ప్రస్తావించారు.

మొత్తంమీద మాట్లాడిన ప్రతిచోట… కేసీఆర్ ప్రసంగంలో మునుపటి వాడీవేడీ కనిపించాయి. ఆయన మార్కు పంచ్ లు పేలాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేశారు..కేసీఆర్ లో ఈ మార్పేంటి దీని వెనక ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా…. ఇప్పటినుంచే పార్టీని రాష్ట్రవ్యాప్తంగా మాళ్లీ సమయాత్తం చేస్తున్నారా ..శ్రేణుల్లో ఉత్తేజం నింపతున్నారా ? రాజకీయవర్గాల్లో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here