Home Entertainment Now Showing

అనుకున్నదే.. డిస్కో రాజాకు సంక్రాంతి సినిమాల దెబ్బ..

ముందు నుంచి అనుకుంటున్నదే.. ఇప్పుడు మరోసారి కలెక్షన్స్ రూపంలోనే కనిపించింది. డిస్కో రాజా సినిమాను రాంగ్ టైమ్ లో రిలీజ్ చేసారంటూ ముందు నుంచి కూడా రవితేజ అభిమానులు కాస్త అసంతృప్తిలోనే ఉన్నారు. అయితే సంక్రాంతి సినిమాలు అప్పటికే వచ్చి రెండు వారాలు అయిపోతాయి కాబట్టి థియేటర్స్ దొరుకుతాయి అనుకున్నారంతా.. కానీ మూడో వారంలోనూ పండగ సినిమాలే ఉండటంతో మాస్ రాజాకు సరైన థియేటర్స్ దొరకనే లేదు.

సంక్రాంతి సినిమాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం థియేటర్లు బుక్ చేసుకున్నారు నిర్మాతలు. పైగా అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి ఉద్దండులు ఉండటంతో ఇంక థియేటర్స్ కు కొదవేం ఉంటుంది. అందుకే మూడో వారంలో కూడా పండగ సినిమాలే దర్శనమిచ్చాయి. ఎంత మంచివాడవురా సినిమా కోసం ఉన్న థియేటర్స్ మాత్రమే రవితేజకు ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే తొలిరోజు డిస్కో రాజా కేవలం 3 కోట్లు మాత్రమే తీసుకొచ్చాడు. ఇక వీకెండ్ వసూళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి. థియేటర్లు తగ్గిపోవడంతో షేర్ కూడా భారీగానే పడిపోయింది. దానికి తోడు నెగిటివ్ టాక్ రావడంతో వీకెండ్ పరిస్థితి కూడా నిరాశాజనకంగానే ఉంది. థియేటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండుంటే కచ్చితంగా వీకెండ్ వసూళ్లు బాగా వచ్చేవి. కానీ సంక్రాంతి సినిమాల దెబ్బకు అటూఇటూ కాకుండా పోయింది రవితేజ సినిమా. మరి ఇలాంటి సమయంలో 22 కోట్ల షేర్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here