Home Entertainment Now Showing

రవితేజ డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్స్

మాస్ రాజా రవితేజ హీరోగా విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన సైఫై డ్రామా డిస్కో రాజా. ఈ సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు మామూలుగానే ఉన్నాయి. పైగా రవితేజ ఫ్లాపుల్లో ఉండటంతో ఎవరూ పెద్దగా అంచనాలు కూడా పెట్టుకోలేదు. అయితే విఐ ఆనంద్ దర్శకుడు కావడం.. సైంటిఫిక్ సినిమా కావడంతో ఎలా ఉంటుందో అనే ఆసక్తి మాత్రం ఉంది.

అయితే డిస్కో రాజా చిత్రానికి తొలిరోజు టాక్ కూడా యావరేజ్ గానే వచ్చింది. సైన్స్ ఫిక్షన్ అని చెప్పినా కూడా తర్వాత మొత్తం రొటీన్ రివేంజ్ డ్రామా కావడంతో కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే వచ్చాయి. సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్స్ లో ఉండటంతో డిస్కో రాజాకు తక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. ఆ ప్రభావం వసూళ్లపై కూడా పడింది. తొలిరోజు వసూళ్లు దీనికి మామూలుగానే వచ్చాయి. గతంలో రవితేజ సినిమాకు తొలిరోజే కనీసం 4 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో షేర్ వచ్చేది. కానీ ఇప్పుడు డిస్కో రాజా మాత్రం కేవలం 3 కోట్ల వరకు మాత్రమే షేర్ తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకా లెక్కలు పూర్తిగా బయటికి రాలేదు.

ఓవర్సీస్ లో కూడా భారీగానే ప్రీమియర్స్ వేసినా అక్కడ కేవలం కోటి మాత్రమే వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా తొలిరోజు 4 కోట్ల షేర్ కు అటూఇటూగా తీసుకొచ్చినట్లు అంచనా. టాక్ యావరేజ్ గా ఉండటం.. సంక్రాంతి సినిమాలు ఇంకా సత్తా చూపిస్తుండటంతో రవితేజ ఎంతవరకు ఈ సినిమాను సేఫ్ జోన్ కు తీసుకొస్తాడు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.