Home Entertainment Cinema

రవితేజ క్రాక్ సినిమా కథ అలా ఉండబోతుందా..? స్టోరీ లీక్ అయిందా?

డిస్కో రాజా సినిమాతో మరోసారి నిరాశ పరిచాడు రవితేజ. ఈ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడేమో అనుకుంటే మరో ఫ్లాప్ ఇచ్చాడు మాస్ రాజా. విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్స్ వేటలో బాగా వెనకబడిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ సారి రవితేజ సినిమాను ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా వసూళ్లు రాలేదంటే రవితేజ ఇమేజ్ పడిపోయిందని అర్థమైపోతుంది. ఇలాంటి సమయంలో ఈయన నటిస్తున్న సినిమా క్రాక్. పోలీస్ ఆఫీసర్ గా ఇందులో నటిస్తున్నాడు రవితేజ. శృతి హాసన్‌ చా

లా ఏళ్ళ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేస్తుంది. దీనికోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత గోపీచంద్‌ మలినేనితో రవితేజ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాననే ధీమాతోనే కనిపిస్తున్నాడు రవితేజ. మే 8న సమ్మర్‌ స్పెషల్‌గా క్రాక్ సినిమాని విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా అమ్మాయిలపై జరిగే అత్యాచారాల గురించి సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఇద్దరు శక్తివంతమైన మహిళా పాత్రలు ఉన్నాయని.. అందులో ఒకటి హీరోయిన్ కాగా మరొకరు వరలక్ష్మి శరత్ కుమార్ అని చెబుతున్నారు మేకర్స్. సముద్రకని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘మెర్సల్‌’, ‘విజిల్‌’ వంటి సూపర్‌ హిట్‌ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ఈ సినిమాకి కెమెరామెన్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశ ఎపిసోడ్ కూడా ఉంటుందని ప్రచారం అయితే జరుగుతుంది. మరి గోపీచంద్ మలినేని ఈ సీన్ రాసుకున్నాడా.. ఒకవేళ రాసుకుంటే ఎలా తెరకెక్కించి ఉంటాడు.. దాన్ని కథకు ఎలా లింక్ చేసి ఉంటాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూడాలిక.. క్రాక్ సినిమా కథకు సమాజంలో జరిగే అన్యాయాలే మూలం అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి అది ఎలా ఉండబోతుందో.. ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ కొడతాడా లేదా అనేది చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here