Home Entertainment Cinema

రష్మిక,రక్షిత్ అందుకే విడిపోయారా…?

ఛ‌లో`,`గీత‌గోవిందం` బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో ర‌ష్మిక మండ‌న యూత్ లో పిచ్చ క్రేజ్ ద‌క్కించుకుంది. అందం, అభిన‌యంతో కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టించిన ఈ భామ ప్ర‌స్తుతం `దేవ‌దాస్`, `కామ్రేడ్` చిత్రాల్లో న‌టిస్తోంది. ఇలా మంచి ఫామ్ లో ఉన్న ర‌ష్మిక‌ తన బాయ్ ఫ్రెండ్ ర‌క్షిత్ కి బ్రేకప్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచ‌ల‌నం. మాములు బ్రేకప్ అయితే అంత హడావిడి ఏముంది కాని నిశ్చితార్దం చేసుకుని మ‌రీ బ్రేక‌ప్ చెప్పుకున్నారు ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్….

రెండు విజ‌యాల‌తోనే అమ్మ‌డు పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. అటు మాతృభాష‌ క‌న్న‌డ‌లోనూ బిజీగా ఉంది. ఇంత హ్యాపీ లైఫ్‌లో ప్రేమ అనేది ఈ బ్యూటీ పాలిట శ‌త్రువైంది. తొలి సినిమాతోనే క‌న్న‌డ స్టార్ ర‌క్షిత్ శెట్టితో ప్రేమ‌లో ప‌డింది. ఆ వ్వ‌వ‌హారం పెళ్లి వర‌కూ దారి తీసింది. ఆ మ‌ధ్య ఘ‌నంగా నిశ్చితార్ధం కూడా జ‌రిగింది. ఆ ఉత్సాహాంలో టాలీవుడ్ సినిమాల్లో వ‌రుస‌గా అవ‌కాశాలు రావ‌డం…పెద్ద హీరోయిన్ అవ్వ‌డం అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

మరి వీరికి గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే త‌న కెరీర్ గురించి ఆలోచించే రస్మిక ర‌క్షిత్ ను క‌ట్ చేయాల‌ని భావించి లైట్ తీసుకుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ అస‌లు కార‌ణాలు ఏంట‌న్న‌వి ఇద్ద‌రూ వెల్ల‌డించ‌లేదు. రెండుసార్లు ర‌క్షిత్ ఫేస్ బుక్ లో కి వ‌చ్చినా పాడిన పాట‌నే మ‌ళ్లీ పాడాడు. ద‌య‌చేసి ర‌ష్మిక‌ను త‌ప్పుబ‌ట్డొద్దు. త‌న‌పై క‌థ‌నాలు ఆపండి. త‌న కుటుంబం ఎంతో క్షోభ‌కు గుర‌వుతుంద‌ని తెలిపాడు.

అయితే స్టార్ అయిన త‌ర్వాత ర‌ష్మిక ఆలోచ‌న‌లు మారిన‌ట్లు ర‌క్షిత్ శెట్టికి బ్రేక్ అప్ చెప్పి హ్యాండ్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం సాగింది. ప్రేమ క‌న్నా కెరీర్ ముఖ్య‌మ‌ని భావించే ఇలా చేసింద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కోంది. ర‌ష్మిక ఇంకా ర‌క్షిత్ తో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెప్పుకొచ్చినా…ఆమె స‌న్నిహితులు మాత్రం ర‌క్షిత్ కు దూరంగా ఉంటుంద‌నే ఆ ఆగ్ల ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింది. దీంతో ఇందులో ఎంత వాస్త‌వం ఉంది? ఏది అబ‌ద్దం? అన్న‌ది ప్రేక్ష‌కులకు కన్య్ఫూజ‌న్ గా మారింది. న‌య‌న‌తార బ్రేక‌ప్ స్టోరీల్లానే ర‌ష్మిక పెళ్లి విష‌యం కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.

తాజాగా ఈ బ్రేకప్ కు కార‌ణంగా మ‌రో రూమ‌ర్ కూడా వినిపిస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌ల‌కు రావ‌డానికి కార‌ణం ఓ మేనేజ‌ర్ అని ప్ర‌చారం సాగుతోంది. ర‌ష్మిక టాలీవుడ్ సినిమాల‌తో బిజీ అవుతోన్న నేప‌థ్యంలో ర‌క్షిత్ నే స్వ‌యంగా ప్రియురాలు కోసం ఓ మేనేజ‌ర్ ను అపాయింట్ చేసాడుట‌. అప్ప‌టి నుంచి ర‌ష్మిక ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డ మేనేజ‌ర్ కూడా ఉంటున్నాడుట‌. దీంతో ప్రైవ‌సీ కోల్పోతున్నాన‌ని ర‌క్షిత్ కు వివ‌రించింద‌ట‌. అయినా ర‌క్షిత్ ప‌ట్టించుకోలేద‌ట‌. ర‌ష్మిక మాట‌ల‌ను విన‌కుండా..స‌ద‌రు మేనేజ‌ర్ కే సపోర్టు చేశాడట. అలా మొద‌లైన చిన్న స‌మ‌స్య చినుకు చినుకు గాలి వాన‌లా మారి..ఇద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్ధ‌ల‌కు దారి తీసింద‌ని అంటున్నారు. ర‌క్షిత్ యాట్యుట్యూడ్ వ‌ల్లే స‌మ‌స్య మొద‌లైంద‌న్న టాక్ కూడా వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here