Home Entertainment Cinema

సీరియల్ ఆర్టిస్ట్‌గా కనిపించబోతోన్న రాశి ఖన్నా

నలుగురిని గాల్లోకి ఎగరేసి కొట్టడం, పవర్‌ఫుల్‌ పంచ్‌లు పేల్చడం ఎవరైనా చేస్తారు. ప్రభుదేవా స్టెప్పులు దింపేసే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఎవరుపడితే వాళ్లు కామెడీ చెయ్యలేరు. అందుకే నవరసాల్లో హాస్యం చాలా కష్టం అంటారు. అయితే ఒక హీరోయిన్ ఈజీగా నవ్విస్తోంది. కామెడీ హీరోయిన్‌ రోల్స్‌కి ఫస్ట్‌ ఆప్షన్‌లా మారుతోంది రాశీఖన్నా.

హీరోయిన్లు సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్ చేస్తుంటారు. అయితే రాశీ ఖన్నా మాత్రం కామెడీ రోల్స్‌ చేస్తోంది. రెగ్యులర్ గ్లామర్ రోల్స్‌కి భిన్నంగా నవ్వించాలనుకుంటోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో రాశి టీవీ సీరియల్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తుందట. ఈ క్యారెక్టర్ చాలా హిలేరియస్‌గా ఉంటుందని సమాచారం.

రాశీ ఖన్నా ఇంతకుముందు మారుతి తీసిన ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలో కూడా కామెడీ చేసింది. టిక్‌టాక్ స్టార్‌ ఏంజెల్ ఆర్నా క్యారెక్టర్‌తో నవ్వించింది. అంతకుముందు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేసిన ‘సుప్రీమ్’ సినిమాలో కూడా రాశి కామిక్‌ రోల్ ప్లే చేసింది. బెల్లం శ్రీదేవి పాత్రతో నవ్వించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here