పెద్దన్న ట్రంప్ సభకు ఎంత మంది వచ్చారు… అసలు ఈ విషయం లో జాతీయ మీడియా ఏం చెబుతోంది .. ఎందుకంత ఓవర్ ఆక్షన్ .. అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. మీడియా అంతటా ఆహా.. ఓహో అంటూ అదే పనిగా ఊదర కొట్టాయి కానీ.., అసలు అంత మంది రాలేదని సోషల్ మీడియా రాయితీ కోడై కూస్థోంది .. ఎంత మంది వచ్చారు అనేది అసలు అంశమే కాదు. ట్రంప్ వచ్చాక మనకు ఏమి ఒనగూరినది అనీ ఆలోచించాలి .. అంతే గాని., గ్రాండ్ వెల్కమ్ చెప్పారా లేదా అనేది సెకండరీ విషయం …అయితే దీని మీద కొన్ని జోక్స్ కూడా నడుస్తున్నాయి. అందులో రాంగోపాల్ వర్మ ట్వీట్ ఒకటి.

అయన ఏమని ట్వీట్ చేశారంటే … మోడీ తో ట్రంప్ అన్నారట…: మోడీ గారు … నన్ను చూడడానికి 70 లక్షల మంది వస్తారని చెప్పారే.. మరి లక్ష మంది వచ్చారేంటి … అని అడిగారట…
అందుకు మోడీ గారు సమాధానమిస్తూ … అయ్యా త్రయం గారూ.. ఒక డాలర్ విలువ 70 రూపాయలు వున్నట్లే., ఒక గుజరాతి ఆంటీ 70 మందితో సమానం అన్నారట…
మోడీ గారికి గుజరాతీలు అంటే అంతటి అభిమానం అన్న అర్ధం లో సాగింది ఇక్కడ వర్మ కామెంట్..