Home Entertainment Cinema

దిశ సినిమా వచ్చేస్తుంది.. షూటింగ్ మొదలుపెట్టిన వర్మ..

వర్మ ఓ మాట చెప్పిన తర్వాత దాన్ని కొన్నిసార్లు మరిచిపోతుంటాడు. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసినా కూడా అవి మొదలుపెట్టలేదు కూడా. అందులో జయలలిత బయోపిక్ అమ్మ, శశికళ లాంటి సినిమాలున్నాయి. అయితే ఇప్పుడు దిశ సినిమాను మాత్రం చెప్పినట్లుగానే మొదులపెట్టేసాడు ఈయన. అయినా వాస్తవిక ఘటనలను సినిమాలుగా మార్చడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా కథ రాసుకుని సినిమా చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ చిత్రంలో చాలా భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని ప్రకటించాడు. ఇప్పుడు చిత్ర షూటింగ్ మొదలుపెట్టాడు ఈయన. దిశ ఘటన ఎక్కడైతే మొదలైందో అక్కడే షూటింగ్ కూడా మొదలైంది. తొండుపల్లి టోల్ గేట్ దగ్గర ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది.

ఆ తర్వాత షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర కూడా కొన్ని సీన్స్ చిత్రీకరించారు యూనిట్. ఆడపిల్లలకు అన్యాయం చేయాలి అనే ఆలోచన వచ్చిన వాళ్లను కూడా ఎంత దారుణంగా శిక్షించాలనేది తన సినిమాలో చూపిస్తానంటున్నాడు వర్మ. అసలు దిశ ఘటన ఎలా జరిగింది.. ఆ రోజు ఏం జరిగింది.. ఎందుకు వాళ్లు అలా చంపేయాల్సి వచ్చింది అనే ఘోర నిజాలు కూడా తన సినిమాలో ఉంటాయంటున్నాడు ఈయన. ప్రతీ విషయం క్షుణ్ణంగా దిశ సినిమాలో ఉంటాయని చెప్పాడు ఆర్జీవీ. అయితే కొందరు మాత్రం ఈ చేదు నిజాన్ని మళ్లీ సినిమాగా తీసి సొమ్ము చేసుకుంటావా.. సిగ్గు లేదు అంటూ వర్మను తిడుతున్నారు. అయినా కూడా ఈయన ఎవరి మాటా వినే రకం కాదు కదా. అన్నట్లుగానే ఇప్పుడు సినిమా మొదలుపెట్టేసాడు.

దిశ ఘటనలో నిందితుడు జొల్లు శివ తల్లి వర్మ చిత్రంపై స్పందన చూడండి:

ఈ ఘటనలో నిజాలు తెలుసుకోవడం కోసమే చెన్నకేశవులు భార్యను కూడా కలిసాడు వర్మ. ఆమెకు కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు. ఫిబ్రవరి 29 రాత్రి రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద వద్ద ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అత్యాచార ఘటనలోని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నాడు వర్మ. అత్యాచారం చేసిన తర్వాత మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మృతదేహాన్ని కాల్చడం, అక్కడే స్కూటీ వదిలేయడం, లారీలో ఆమెను తీసుకెళ్లడం లాంటి సన్నివేశాలను చిత్రీకరించారు. మొత్తానికి దిశ సినిమా వచ్చేస్తుందన్నమాట. అయితే ఇందులో ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు వర్మ. త్వరలోనే అన్ని వివరాలు బయటికి రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here