Home Entertainment Cinema

నానికి నంది అవార్డు ఇప్పించిన రామ్ చరణ్..

అదేంటి.. నానికి నంది రామ్ చరణ్ ఇప్పించడం ఏంటి..? అయినా కూడా నాని మంచి నటుడు కదా.. అలా రిఫెరెన్సులు ఏం అవసరం అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు ఇలాంటి విచిత్రమే ఒకటి జరిగింది. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా నానికి నంది అవార్డు రావడానికి కారణం మాత్రం రామ్ చరణే. అప్పట్లో నానికి నందిని తీసుకొచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు కథ రామ్ చరణ్ కోసం రాసుకున్నాడు గౌతమ్ మీనన్.

ఇండస్ట్రీలో ఓ హీరోకు చేయాల్సిన కథలు మరో హీరో చేయడం కామన్. అయితే మామూలు విషయం కూడా. చాలా మంది హీరోలు తమ కోసం రాసుకున్న కథలను మరో హీరోలకు ఇస్తుంటారు. అప్పట్లో ఇలాంటి చిత్రమే జరిగింది. కొన్ని సినిమాలను హీరోలే తమ ఇమేజ్ కు సూట్ కావని వదిలేసుకుంటారు. అలా రామ్ చరణ్ కాదనుకున్న సినిమా నాని చేసి నందిఅవార్డు కూడా అందుకున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కమర్షియల్ గా విజయం సాధించలేదు కానీ నానికి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది ఈ చిత్రం. నంది అవార్డు కూడా వచ్చింది. ఇందులో సమంతతో నాని కెమిస్ట్రీ పీక్స్ అంతే.

అయితే ఈ సినిమా ముందు రామ్ చరణ్ చేయాల్సింది.. ఆయనకు కథ కూడా నచ్చింది. అయితే అప్పటికే ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీ చేస్తే బాగుందన్నారు కానీ కమర్షియల్ హిట్ రాలేదు. దాంతో వెనకడుగు వేసాడు ఈయన. ఆ తర్వాత రామ్ కూడా ఓకే చెప్పి వదిలేసుకున్నాడు. అప్పుడు నాని లైన్ లోకి వచ్చాడు. అలా ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా రామ్ చరణ్, రామ్ లాంటి హీరోలను కాదనుకుని నాని దగ్గరికి వచ్చింది. గౌతమ్ వాసుదేవన్ మీనన్ ఈ సినిమాను నిజంగానే ఓ క్లాసిక్ గా తీసాడు. సినిమా హిట్ కాలేదనే మాటే కానీ ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ లిస్టులో మాత్రం ఉంటుంది. అలా నానికి నంది అవార్డు రావడానికి తనకు తెలియకుండానే సాయపడ్డాడు మెగా వారసుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here