సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా ఇతర అనారోగ్య సమస్యలతో మరణించగా తాజాగా ఆర్జీవీ సోదరుడు సోమశేఖర్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. ఈయన పలు సినిమాలకు పని చేశారు. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

రాంగోపాల్ వర్మకు అత్యంత సన్నిహితుల్లో ఆయన సోదరుడు సోమశేఖర్ ఒకరు. కొన్నాళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన ఇతర వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. సోమశేఖర్ మృతిపై బోనీ కపూర్ సంతాపం తెలిపారు. సత్య సినిమా చిత్రీకరణ సమయంలో ఆర్జీవీ కంటే సోమశేఖర్ ను చూస్తేనే ఎక్కువగా భయం వేసేదని.. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సోమశేఖర్ మరణ వార్త తనను షాక్ కి గురి చేసిందన్నారు.