Home Entertainment Cinema

పెళ్ళీ పీఠలు ఎక్కనున్న రాఖీ‌సావంత్‌…వరుడెవరంటే?

బాలీవుడ్ హాట్ లేడీ రాఖీసావంత్. సంచలనాలతో సెన్సేషన్ క్రియోట్ చేసే రాఖీ తాజాగా తన పెళ్ళీ పేరుతో వార్తల్లోకి ఎక్కారు. బాలీవుడ్‌లో సెలబ్రిటీల పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. దీనిని కంటిన్యూ చేస్తూ దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రాల తరువాత తాను ఈ జాబితాలో చేరుతున్నానంటూ వివాదాల క్వీన్ రాఖీ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. తాజాగా రాఖీ తన పెళ్లి కార్డును సోషల్ మీడియాలో షేర్ చేసి హల్ చల్ చేసింది.

గతంలో రాఖీ సావంత్ స్వయంవరం పేరుతో హడావిడి చేసింది. తన లైఫ్ పార్టనర్ ఎంపిక తన ఇష్టమంటూ హడావిడి చేసింది. ఏదో ఒక ఇష్యూ క్రియోట్ చేసి వార్తల్లో ఉండేందుకు ఇష్టపడే ఈ అమ్మడు మళ్ళీ పెళ్ళీ పేరుతోనే లైమ్ లైట్ లోకి వచ్చింది. తాజాగా రాఖీ తన పెళ్లి కార్డును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది. పైగా వరుని గురించి తెలుసుకున్నవారంతా షాకవుతున్నారు.

ఈ కార్డులో ఉన్న వివరాల ప్రకారం రాఖీ సావంత్… దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబోతోంది. ‘ఇండియా గాట్ టాలెంట్’లో దీపక్ కనిపిస్తున్నారు. మరోవైపు దీపక్ కూడా ఈ పెళ్లి కార్డును షేర్ చేస్తూ ఇంత త్వరగా ఇదంతా జరుగుతుందనుకోలేదు అని కామెంట్ రాశారు. రాఖీ చెప్పిన వివరాల ప్రకారం వారి వివాహం డిసెంబరు 31న లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. అయితే ఈ వార్త విన్నవారంతా ఇది రాఖీ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here