Home News Stories

సీఎం అవడానికి ఏం చేయబోతున్నాడో తెలుసా?

ప్రస్తుతం తమిళనాట ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా రాజకీయాల్లోను సత్తా చూపించాలని చూస్తున్నాడు. దానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే రాజకీయ రంగప్రవేశం చేసినా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం లేడు రజినీ. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నాడు సూపర్ స్టార్. ఇందులో భాగంగానే ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూట్ ఫాలో కావాలని చూస్తున్నాడు. ప్రజల దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాలని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమిళనాట పాదయాత్రకు రజనీకాంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తున్న అన్నాత్త సినిమా పూర్తి కాగానే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై ఫోకస్ చేయాలని ఆలోచిస్తున్నాడు రజనీకాంత్. అందులో పాదయాత్ర కూడా ఒకటి. ప్రజల దగ్గరికి వెళ్లి నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అయితే 70 ఏళ్ల వయసులో రజినీకాంత్ పాదయాత్ర అంటే అంత చిన్న విషయం కాదు. పైగా ఈ మధ్య ఆయన ఆరోగ్యం కూడా అంత బాగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పాదయాత్ర చేయడం కాస్త కలవరపెట్టే విషయమే. కానీ రజనీకాంత్ మాత్రం జగన్ దారిలోనే వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. అలా చేస్తే ప్రజలకు మరింత దగ్గరై రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నాడు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి నిజంగానే రజినీకాంత్ పాదయాత్ర చేస్తే మాత్రం తమిళనాట అదో పెద్ద సంచలనం. ఆయన లాంటి సూపర్ స్టార్ రోడ్డుపైకి వచ్చి నడుస్తూ ఉంటే ఆ జన ప్రభంజనం ఆపడం ఎవరి తరం కాదు. మరి దీనికి అనుమతులు వస్తాయా రావా.. ఒకవేళ వస్తే రజినీకాంత్ ఎంత దూరం పాదయాత్ర చేస్తాడు.. చేస్తే ఆయనకు ఎంత వరకు ఉపయోగం ఉంటుంది..

ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ప్రస్తుతానికి మాత్రం ఆయన సినిమాలపై దృష్టి పెట్టాడు. 2021 ఎన్నికల్లో కచ్చితంగా తాను పోటీ చేస్తానని చెబుతున్నాడు రజిని. మరి ఎన్నికలకు ఏడాది కూడా లేకపోయినా రజనీకాంత్ మాత్రం చాలా ధీమాగా కనిపిస్తున్నాడు. ఒకవేళ నిజంగానే పాదయాత్ర చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. జయలలిత, కరుణానిధి చనిపోయిన తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత పూడ్చే నాయకుడి కోసం ప్రజలు ఆశగా వేచి చూస్తున్నారు. మరి దాన్ని రజనీకాంత్ ఎంత వరకు భర్తీ చేస్తారనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here