Home News Updates

రజినీకాంత్‌కు చేదు అనుభవం.. ఫ్లైట్‌కు సాంకేతిక లోపం..

చెన్నై ఎయిర్ పోర్టులో రజినీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈయన ఎక్కిన ప్లైట్ డిలే అయింది. సాంకేతిక లోపం వచ్చి కొన్ని గంటల పాటు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. టేకాఫ్ కు ముందే లోపాన్ని కనుగొనడంతో ప్రమాదం తప్పింది. చెన్నై టూ మైసూరు వెళ్లాల్సిన ఓ ప్రైవేటు విమానం ఇలా ఎయిర్ పోర్టులోనే ఆగిపోయింది. దాంతో మరో ఆప్షన్ లేక రజినీకాంత్‌తో సహా ప్రయాణికులంతా రెండు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఎదురు చూసారు.

రజినీ ఉన్నాడనే సంగతి తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చుట్టుముట్టేసారు. ఆయన కూడా చాలా సేపు అభిమానులతో పాటు ముచ్చటించడమే కాకుండా ఫోటోలు కూడా ఇచ్చాడు. ఫ్లైట్ బాగయ్యే వరకు కూడా అక్కడే ఉన్నాడు సూపర్ స్టార్. లోపాన్ని సవరించిన తర్వాత అక్కడ్నుంచి వెళ్లాడు సూపర్ స్టార్. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ప్రైవేట్ జెట్ యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణ చెప్పారు.

అందులో రజినీతో పాటు మరో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తానికి అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజినీ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సిరుత్తై శివ ఇందులో ముందున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here