Home Entertainment Cinema

రాజశేఖర్ తో శ్రీదేవి పెళ్లి ఎందుకు క్యాన్సల్ అయింది..

అదేంటి హీరో రాజశేఖర్ తో శ్రీదేవి పెళ్లి జరిపించాలనుకున్నారా.. ఇది ఎప్పుడు జరిగింది.. అసలు రాజశేఖర్ శ్రీదేవి పరిచయం ఎలా మొదలైంది.. వాళ్ల పెళ్లి ముచ్చట్లు ఏంటి ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి కదా. దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఫిబ్రవరి 24న శ్రీదేవి రెండో వర్ధంతి సందర్భంగా ఆమె పెళ్లి గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యం బయటికి వచ్చింది. శ్రీదేవి అసలు పేరు అమ్మయంగార్ అయ్యప్పన్‌. శ్రీదేవికి చిన్నప్పుడే ఘోర ప్రమాదం తప్పింది. రాఘవేంద్రవావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నప్పుడు రోడ్డు దాటే సమావేశంలో ఘోర తప్పిదం జరిగింది. అయితే అదృష్టం బాగుండి ఆ రోజు ఏమీ కాలేదు.. కానీ వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పించుకున్న శ్రీదేవి మాత్రం ఆ తర్వాత సూపర్ స్టార్ అయింది.

Sridevi Rajasekhar

బడిపంతులు సినిమా లో సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి పదేళ్లు తిరిగేసరికి అదే ఎన్టీఆర్ వేటగాడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హిందీ సినిమాలలో కూడా నటించింది ఈమె. ముఖ్యంగా అక్కడ రాఘవేంద్రరావు తెరకెక్కించిన హిమ్మత్‌వాలాతో సూపర్ స్టార్ అయిపోయింది శ్రీదేవి. హిందీ సినిమాలో ఎప్పుడైతే స్టార్‌గా ఎదిగిందో ఆమె తల్లి వెంటనే తనకు పెళ్ళి చేయాలని పట్టు పట్టింది. బాలీవుడ్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక ఆమెకు పెళ్లి చేస్తే జీవితం మరింత బాగుంటుందని శ్రీదేవి తల్లి ఆలోచించింది. అయితే ఆమెను ఎవరికి ఇచ్చి చేయాలి అనే మాటలు వచ్చినప్పుడు తెలిసిన వాళ్ల ద్వారా రాజశేఖర్ గురించి ఆమెకు వివరాలు తెలిసాయి. కుర్రాడు మంచివాడు.. పైగా డాక్టర్ అని చెప్పడంతో హీరో రాజశేఖర్‌కి వచ్చి వివాహం చేయాలనుకున్నారు ఆమె తల్లి.

అందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు గారి తమ అబ్బాయి ఇవ్వమని రాజశేఖర్ తల్లి తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ప్రపోజల్‌ని అక్కడితోనే ఆపేశారు. శ్రీదేవి సంబంధం వచ్చినప్పుడు రాజశేఖర్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఎంబిబిఎస్ చదువుతున్నాడు. అలా రాజశేఖర్ శ్రీదేవి పెళ్లి అనుకోకుండా ఆగిపోయింది. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మాత్రం ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేదో అంటున్నారు అభిమానులు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ వెళ్లడం.. అక్కడ బోనీ కపూర్ ను పెళ్లి చేసుకోవడం జాన్వీ కపూర్, ఖుషి కపూర్లకు జన్మనివ్వడం జరిగింది. 55 ఏళ్ల వయసులో 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో ఒక పెళ్ళికి హాజరైన శ్రీదేవి అక్కడ అనుకోని పరిస్థితుల్లో కన్నుమూసింది. అని దూరమై రెండేళ్ల అవుతున్న అభిమానులు ఇప్పటికీ శ్రీదేవి మరిచిపోలేకపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here