Home Entertainment Cinema

తాత అయిన వర్మ.. రాజమౌళి ఫన్నీ ట్వీట్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాత అయ్యాడు. ఈయన కుమార్తె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఇప్పటి వరకు నాన్నగా ఉన్న ఈయన తాతగా ప్రమోషన్ అందుకున్నాడు. వర్మ తాత అయ్యాడన్న విషయం తెలుసుకుని చాలా మంది సినిమా సెలబ్రిటీస్ ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదే విషయాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి కూడా తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఈయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. వర్మ, రాజమౌళి మధ్య ఎంత మంచి సన్నిహిత్యం ఉందనేది ఈ ఒక్క ట్వీట్ లోనే తెలిసిపోతుంది.

వర్మ స్టైల్ లోనే ఆయనకు కంగ్రాట్స్ చెప్పాడు రాజమౌళి. కంగ్రాచ్యులేషన్స్ రామూ తాతయ్య గారూ. ఎట్టకేలకు మీకు కళ్లెం వేసేందుకు మీ మనవరాలు వచ్చేసింది. ఇక మిమ్మల్ని ఏమని పిలవాలి.. రామూ తాతా.. రామూ నాన్నా లేదా గ్రాండ్ పా రామూ.. అని ప్రశ్నించాడు రాజమౌళి. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శక ధీరుడితో పాటు ఇంకా చాలా మంది వర్మకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here