Home News

రఘురామరాజుని ఉంచిన మిలటరీ ఆస్పత్రిలో జరుగుతుంది ఇదే…!

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సికింద్రాబాద్ లో మిలటరీ ఆస్పత్రిలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు. వీఐపీ స్పెషల్ రూమ్ లో ఎంపీ రఘురామ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆర్మీ వైద్యులు. రఘురామరాజు కుడి కాలుకి వాపు,నొప్పి ఉండటంతో దానికి చికిత్స అందిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఓ న్యాయధికారిని కూడా ఇక్కడ నియంమించింది. రఘురామరాజు ఆస్పత్రిలో ఉన్న కాలాన్ని కూడా జ్యూడీషియల్ కష్టడీలో భాగంగానే చూడాలని సుప్రీం ఆదేశించింది.

సుప్రీం ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు రిజిస్టర్ నాగార్జున ను న్యాయధికారిగా నియమించారు. చికిత్స ప్రక్రియ మొత్తాన్ని ఆర్మీ సిబ్బంది వీడియోలో రికార్డ్ చేస్తున్నారు… రఘురామ కృష్ణంరాజు స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేస్తుంది. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి పై సాయంత్రం తర్వాత వివరిస్తామని కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నందున ఎవరిని ఈ సమయంలో కలవడానికి అనుమతించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here