Home News

టీటీడీ చైర్మన్ గా మళ్లీ ఎవరికి చాన్స్..వైవీకి మళ్లీ చాన్స్ లేనట్లే…!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు ఈ నెల చివరికి ముగుస్తుంది. కొత్త చైర్మన్ రాబోతున్నారు. మళ్లీ వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా కొనసాగరు అన్న చర్చ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరించబోతుందన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఈ సారి టీటీడీ చైర్మన్ రేసులో హేమాహేమీల పేర్లు వినిపిస్తున్నాయి.

టీటీడీ రేసులో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మేకపాటి తనయుడు గౌతం రెడ్డి మంత్రిగా ఉన్నారు. మళ్ళీ అదే కుటుంబంలోనీ వ్యక్తికి మరో పదవి ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఉన్న భూమన టీటీడీ చైర్మన్ పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. చైర్మన్ పదవీకాలం పూర్తవ్వగానే వైవీ సుబ్బారెడ్డి మాత్రం మరో పదవి పై కన్నేశారట. ఎమ్మెల్సీ చాన్స్ దక్కించుకుని ఆరునెలల్లో జరిగే కేబినెట్ విస్తరణ అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారట.

టీటీడీ చైర్మన్ మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. జగన్ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పోస్టులన్ని రెడ్లకే ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు టీటీడీ చైర్మన్ తో పాటు టీటీడీ కీలక పదవుల్లో ఈవోగా జవహర్ రెడ్డి, అదనపు ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు. దీంతో రెడ్డి సామాజికవర్గానికి చాన్స్ ఉందన్న చర్చ సైతం నడుస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సీవీఎస్ కే శర్మను టీటీడీ చైర్మన్ గా చేస్తే ఎలా ఉంటుంది అని పార్టీ నాయకులు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. వైఎస్ సర్కార్ లో కీలకపాత్ర పోషించి సన్నిహితంగా మెలిగిన శర్మకు ఆ చాన్స్ దక్కొచ్చన్న చర్చ పార్టీలో నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here