Home Entertainment Cinema

నా కొడుకు రొమాంటిక్ అంటున్న పూరీ జగన్నాథ్..

ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. నిజంగానే ఇప్పుడు పూరీ జగన్నాథ్ తనయుడు చాలా రొమాంటిక్ అయిపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే పూరీ దగ్గరుండి కొడుకును రొమాంటిక్ గా మార్చేస్తున్నాడు. దగ్గరుండి మరీ ముద్దులు పెట్టిస్తున్నాడు కూడా. ఇప్పుడు విడుదలైన రొమాంటిక్ సినిమా పోస్టర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆకాశ్ ను ఎలాగైనా స్టార్ గా నిల‌బెట్టాల‌ని క‌ల‌లు కంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ కుర్రహీరోతో చేసిన మెహ‌బూబా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే కొడుకు కెరీర్ కు గ‌ట్టి పునాది వేయాల‌ని చూస్తున్నాడు పూరీ. అది చేసే వ‌ర‌కు నిద్ర‌పోయేలా క‌నిపించ‌ట్లేదు. ప్ర‌స్తుతం మ‌రో క‌థ కొడుకు కోస‌మే రెడీ చేసాడు పూరీ. అదే రొమాంటిక్. ఈ సారి పున‌ర్జ‌న్మ‌లు లాంటివి కాకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడు.

మాస్ ఎలిమెంట్స్ పుష్క‌లంగా ఉండేలా క‌థ రాసి.. మ‌సాలా సినిమా చేయాల‌ని ఫిక్సైపోయాడు. అయితే ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న కాదు. త‌న శిష్యుల్లో అనిల్ ప‌డూరి అనే కుర్రాడికి ఈ ఆఫర్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్ గా ముంబై భామ కేతిక శర్మ నటిస్తుంది. అసలు అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుచెప్పని బ్యూటీ ఈమె. దాంతో రొమాంటిక్ సినిమా కాస్తా ఈమె వచ్చిన తర్వాత మరింత రొమాంటిక్ అయిపోయింది. పోస్టర్స్ చూస్తుంటేనే చలి గిలి ఎక్కువైపోతుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో పోస్టర్స్, వీడియోలు చూస్తుంటే అర్థమైపోతుంది. తాజాగా ఏకంగా లిప్ లాక్ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ఇది చూసిన తర్వాత మహిళా సంఘాలు కూడా తమ నోటికి పని చెబుతున్నాయి. కొడుకుతోనే ఇలాంటి సినిమా చేస్తావా.. సిగ్గు లేదు నీకు అంటూ పూరీపై మండిపడుతున్నారు వాళ్లు. మే 29న విడుదల కానుంది రొమాంటిక్. కచ్చితంగా ఈ చిత్రంతో ఆకాశ్ హిట్ కొడతాడంటూ ధీమాగా చెబుతున్నాడు పూరీ జగన్నాథ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here