Home Entertainment Cinema

పునాదిరాళ్లు ’దర్శకుడు రాజ్ కుమార్ మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా విషాదాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. అది మర్చిపోక ముందే మరో విషాదం కూడా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ ఫిబ్రవరి 15 ఉదయం మృతిచెందారు.

Raj Kumar Direcotr (Chiranjeevi first Movie Punadi Raallu)
Raj Kumar Direcotr (Chiranjeevi first Movie Punadi Raallu)

కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ఒక మీడియా సంస్థ ఆయన గురించి వార్త కూడా రాసింది. దాంతో మా అసోసియేషన్ నుంచి కాదంబరి కిరణ్ రాజ్ కుమార్ వెళ్లి దర్శకుడు రాజ్ కుమార్ కు ఆర్థిక సాయం కూడా చేశారు.

చిరంజీవి సినిమాతో ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. మొదటి సినిమాకే 5 నంది అవార్డులు దక్కించుకున్నారు. అటువంటి దర్శకుడు, నిర్మాత రాజ్ కుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషషం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం.. ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడు అయ్యాడు. పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఫిబ్రవరి 15 ఉదయం మృతిచెందారు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరుకు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here