Home News

పబ్జీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్..మళ్లీ ఇండియాలో ఎంట్రీ

ఆన్‌లైన్‌ మొబైల్‌ బ్యాటిల్‌ గేమ్‌ పబ్జీ భారత్‌లోకి మళ్లీ రానుంది. పబ్జీ మొబైల్‌ ఇండియా పేరుతో ఇంతకు ముందు భారతీయులకు పరిచయమైన ఈ గేమ్‌..బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా పేరుతో త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. పబ్జీ తయారీదారులైన క్రాఫ్టన్ కంపెనీ మనదేశంలో బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే కొత్త గేమ్ లాంచ్ చేయనుంది. ఇది మనదేశం కోసం మాత్రమే రూపొందించిన వేరియంట్ అని తెలిపింది క్రాప్టన్‌. దీంతోపాటు కొత్త అవుట్ ఫిట్స్, ఫీచర్లు, ప్రీమియంలో కొత్త గేమింగ్ అనుభవాన్ని అందిస్తున్నట్లు చెప్పింది క్రాప్టన్‌ కంపెనీ.

దీంతోపాటు టోర్నమెంట్లు, లీగ్స్ కోసం ప్రత్యేకమైన ఎకో సిస్టంను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా లాంచ్ కావడానికి ముందు దీనికి సంబంధించిన ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని పేర్కొంది కంపెనీ. ఇది ఇండియాలో మాత్రమే లాంచ్ కానుంది. మనదేశంలోని మొబైల్ గేమర్లను ఆకట్టుకోవడానికి ఇందులో మూడు రంగులను అందించనున్నారు. మనదేశానికి మాత్రమే సంబంధించిన గేమ్ ఈవెంట్లను నిర్వహించనున్నట్లు పేర్కొంది క్రాప్టన్‌ కంపెనీ. వీటిని లాంచ్‌ తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

ఈ గేమ్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది. గతంలో మనదేశంలో బ్యాన్ అయిన పబ్జీ మొబైల్ గేమ్ ప్లే తరహాలోనే దీని గేమ్ ప్లే కూడా ఉంది. గతంలో మనదేశంలో ప్రైవసీకి సంబంధించిన కారణాలతోనే పబ్జీ నిషేధానికి గురైంది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా విషయంలో అటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా చట్టాలకు లోబడి డేటా సేకరణ, స్టోరేజ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గతంలోనే మనదేశంలో పబ్జీ మొబైల్ ఇండియా పేరుతో లాంచ్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే క్రాఫ్టన్ పబ్జీ అనే పేరును పూర్తిగా వదిలేసి కొత్త పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here