Home News

    ఇండియాలో మళ్లీ ఎంట్రీ ఇస్తున్న పబ్జీ గేమ్..ఈ సారి ఏకంగా

    మార్పులు చేర్పులతో పబ్‌ జీ గేమ్‌ మళ్లీ రాబోతోంది. మార్పులు చేర్పులు చేసి… బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో క్రాఫ్టన్‌ సంస్థ భార‌త్‌లో ఈ గేమ్‌ను విడుద‌ల చేయనుంది. అయితే, తాజా పరిస్థితులు చూస్తే ఇది విడుదల అవుతుందా? అనే సందేహం కలుగుతోంది. ఈ గేమ్‌ చుట్టూ… ఏకంగా రాజకీయరగడ ముదిరింది. ఈ గేమ్‌కు వ్యతిరేకంగా రాజకీయ నేతలు కేంద్రాకికి లేఖలు రాస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే ఈ గేమ్‌ను ఇండియాలో విడుదల కాకుండా చూడాలని కోరారు.

    హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాను తలపించే గ్రాఫిక్స్‌తో ఆకట్టుకుంటుంది పబ్‌జీ. అందుకే ఇప్పుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఈ గేమ్‌దే హవా నడిచింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా… అందరికీ ఇదో వ్యసనంగా మారింది. ఏ నోట విన్నా పబ్‌జీ మాటే. స్కూల్‌ పిల్లాడి నుంచి యువత వరకు ఎవరిని కదిలించినా… జయ్‌ పబ్‌జీ అనే పరిస్థితి. గేమ్‌ ఆడుతున్నంత సేపు… ఓ బ్యాటిల్‌ గ్రౌండ్‌లో ఉన్న ఫీలింగ్‌ తెచ్చే గ్రాఫిక్స్‌.. గేమ్‌లో గంటల తరబడి లీనమయ్యేలా చేస్తాయ్‌. దీంతో… ఎనీ టైం.. ఎనీ వేర్‌.. ఎనీ ప్లేస్‌.. వి విల్‌ ప్లే పబ్‌జీ అనేంతగా యువతరం పిచ్చెక్కిపోయింది.

    తాజాగా తెలంగాణకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు కూడా పబ్జీపై కేంద్రానికి లేఖ రాశారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్‌జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని కోరారు..క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు తెలంగాణ ఎంపీ. ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీ మొబైల్‌కు చెందిన రైట్స్ టెన్సెంట్ దగ్గర ఉన్నాయి. అయితే… పూర్తి స్థాయి మార్పులతో… చిన్నారుల కోసం మరోసారి ఈ గేమ్‌ భారత్‌ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. క్రాఫ్టన్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో సరికొత్తగా సిద్ధమైంది.

    ఈ గేమ్‌కు సంబంధించి వినియోగదారుల డేటా భారతదేశం, సింగపూర్‌లలో నిల్వ చేసినప్పటికీ.. అంతర్జాతీయ సర్వర్ల మధ్య డేటా బదిలీ జరిగే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. క్రాఫ్టన్ దక్షిణ కొరియా దేశానికి చెందిన సంస్థ. ప్రధానంగా క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య ఉన్న సంబంధం గుర్తించి దర్యాప్తు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. క్రాఫ్టన్ పెట్టుబడులను… చైనా దేశానికి చెందిన బెహెమోత్ టెన్సెంట్‌తో ఉన్న ఒప్పందాలను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here