Home News Politics

చిన్నోడు పెద్దల సభ ఎలా రద్దు చేస్తాడు? జగన్ పై ప్రొ హరగోపాల్ వ్యాఖ్యలు

పెద్ద నిర్ణయాలు తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించాలని, అనుభవరాహిత్యంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందూ వెనుకా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రొ హరగోపాల్ అన్నారు. తెలుగుపాపులర్ టీవీ ఇంటర్వ్యూ లో హరగోపాల్ పలు అంశాలపై మాట్లాడారు..

శాసనమండలి విషయంలో గతంలో దీనిపై ఎన్నో చర్చలు జరిగాయని తెలిపారు హరగోపాల్. అసెంబ్లీయే సభ్యులు కొన్ని నిర్ణయాలు ప్రజల ఒత్తిడితో సరిగ్గా తీసుకోలేరని, ఇందుకోసమే పెద్దల సభ ఏర్పాటు చేశారని అన్నారు. కొందరు మేధావులు ప్రత్యక్ష ఎన్నికల పట్ల ఆసక్తి చూపించారని వారిని చట్టసభల్లో పెట్టడానికి మండలి ఉపయోగపడుతుందన్నారు.

ఏది ఏమైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంత సమయం తీసుకుని చర్చించారాలని, ఆవేశంతో తీసుకోకూడదని అన్నారు. హరగోపాల్ ఇంటర్వ్యూ కింది వీడియో లో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here