Home Entertainment Cinema

నాని దర్శకుడిపై కన్నేసిన మహేష్ బాబు..

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబుకు ఆనందం కంటే కూడా భయం ఎక్కువైపోతుంది. హ్యాట్రిక్ విజయాల తర్వాత దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈయన. గతంలో దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో తర్వాత వరస ప్లాపులు వచ్చాయి. ఆగడు, స్పైడర్, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేసాడు మహేష్ బాబు. స్కిప్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈయన. అప్పుడు చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయొద్దని ఫిక్సైపోయాడు. ఒకప్పుడు ఓ హిట్ ఇస్తే మరో సినిమా వెంటనే ఇచ్చే అలవాటున్న మహేష్.. ఇప్పుడు సుకుమార్, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులను కూడా కథలు నచ్చలేదని పక్కనబెట్టేసాడు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సై అంటున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు ఈయన.

ఇప్పటికే ప్రశాంత్ నీల్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాను కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు మహేష్. అయితే అది ఎప్పటికి పట్టాలెక్కుతుందో చెప్పడం కష్టమే. ఇలాంటి తరుణంలో పరుశురామ్ తర్వాత సీనియర్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ఈయన ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో ఎప్పుడూ పని చేయలేదు ఈ దర్శకుడు. ఈయన పని చేసిన పెద్ద హీరో నాని మాత్రమే. అయితే అతన్ని పరిచయం చేసిందే ఈ దర్శకుడు కాబట్టి నానితో కంఫర్ట్ జోన్ ఉంటుంది. అయితే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ను హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి సమయంలో ఈ దర్శకుడితో సూపర్ స్టార్ సినిమా అంటే సంచలనమే. పైగా ఇప్పుడు నానితో వి సినిమా చేస్తున్నాడు ఇంద్రగంటి.

ఈ చిత్రం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంద్రగంటి చెప్పిన కథ ఒకటి మైత్రికి బాగా నచ్చేసినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు కూడా విని ఓకే చేస్తే సినిమాకు ఎలాంటి సమస్యా ఉండదని.. త్వరలోనే దీనిపై కన్ఫర్మేషన్ కూడా వస్తుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here