Home News

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం

ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కీలక విజయాలు సాధించిపెట్టిన ప్రశాంత్ కిషోర్ తాజాగా మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి మరో వైపు తమిళనాడులో డీఎంకే కి ఆపుర్వ విజయాన్ని కట్టబెట్టారు. దీంతో సహజంగానే ఆయన తదుపరి వ్యూహరచన ఏ రాష్ట్రంలో ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. అయితే అందరి అంచనాలకు భిన్నంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రశాంత్ కిశోర్.

ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన పీకే ఇక ఎన్నికల వ్యూహకర్తగా తాను వైదొలగాలని అనుకుంటున్నట్టు తెలిపారు.ఇప్పుడు చేస్తున్న పనినే కొనసాగించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే చాలా చేశాను. నేను బ్రేక్ తీసుకునే సమయం వచ్చింది. జీవితంలో ఇంకేదో చేయాలి. ఈ రంగం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. తిరిగి రాజకీయాల్లో చేరుతారా అనే ప్రశ్నకు నేను విఫల రాజకీయనాయకుడిని. ప్రస్తుతం వెనక్కి వెళ్తున్నాను. ఏం చేయాలనేది చూడాలి” అని పీకే సమాధానమిచ్చారు.

ప్రశాంత్ కిషోర్ గత డిసెంబర్ 21న బీజేపీకి ఓ ట్వీట్‌లో సవాలు చేశారు. పశ్చిమబెంగాల్‌వో బీజేపీ రెండంకెల సీట్లు కూడా దాటదని, తన జోస్యం నిజం కాకుంటే ట్విట్టర్ నుంచి వైదొలగుతానని ఆయన సవాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here