Home News

ప్రశాంత్‌ కిశోర్‌ కామెంట్స్ వెనుక ఆంతర్యం ఇదేనా

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇక నుంచి రాజకీయ సలహాలు ఇవ్వరా..ఏ పార్టీకి రాజకీయ వ్యూహాలు కోసం పని చేయరా ఇప్పుడిదే ఇండియన్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకేను అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిశోర్‌…ఎందుకు సైలెంట్‌ అవుతున్నారు కొద్ది రోజులు విరామం అంటున్న పీకే కామెంట్స్‌ వెనుకున్న ఆంతర్యమేంటి అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఎత్తులు వేయడంలో తిరుగులేని వ్యూహకర్త. ఏ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తే ఆ పార్టీ బంపర్ మెజార్టీతో గెలివాల్సిందే. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పని చేసిన పీకే, మమత బెనర్జీని మూడోసారి అధికారంలోకి తెచ్చారు. రెండు వందలకు పైగా సీట్లలో టీఎంసీ గెలుస్తందంటూ జోస్యం చెప్పారు. ఆయన అన్నట్లే టీఎంసీ తిరుగులేని విజయం సాధించింది. ఇక తమిళనాడులో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలో.. డీఎంకే కు వ్యూహకర్తగా పని చేశారు. స్టాలిన్ తరపున పని చేయగా, ఆ పార్టీ సంచలన విజయం సాధించింది .. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసినా…పీకే వ్యూహాల ముందు తలవంచక తప్పలేదు.

2019లో వైసీపీ తరపున ప్రశాంత్ కిశోర్‌ పని చేశారు. అభ్యర్ధుల ఎంపిక మొదలుకుని, ప్రచారం, పోల్ మెనేజ్ మెంట్ తో సహా అన్ని విషయాల్లో లోతైన స్ట్రాటజీకి…ప్రత్యర్థులకు అడ్రస్‌ లేకుండా పోయింది. 151 అసెంబ్లీ స్థానాలు. 22 లోక్ సభ సీట్లు వైసీపీకి వచ్చాయంటే పీకే మాజిక్కే కారణం. 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ పని చేసారు. కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి రావడంలో అతని వ్యూహాలే కారణం.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో 2012 లో మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ,2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పొషించారు. 2018 సెప్టెంబరు 16న జేడీయూలో రాజకీయ పార్టీలో చేరాడు. సీసీఏ చట్టంపై విమర్శలు గుప్పించడంతో నితీష్ కుమార్‌తో విభేదాలు తలెత్తాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జేడీయూ నుంచి బహిష్కరించారు.

పీకే రాజకీయ చతురత వల్లే టీఎంసీ, డీఎంకే పార్టీలు విజయం సాధించాయని దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ప్రస్తుతం కొంతకాలం బ్రేక్‌ తీసుకొని, జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నానని చెప్పడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here