Home Entertainment Now Showing

మహేష్ సినిమాకు వెళ్లినందుకు ప్రభాస్ హీరోయిన్‌కు చిక్కులు..

వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నమ్మాల్సిన నిజమే ఇది. ఎందుకంటే ఇది జరిగింది కాబట్టి. సరిలేరు నీకెవ్వరు సినిమాకు వెళ్లేటప్పుడే ప్రభాస్ హీరోయిన్ సంజనకు పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. ఈమె ప్రభాస్, పూరిజగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. ఇప్పటికీ ప్రభాస్ హీరోయిన్ అనే అంటారు. ఇక ఇప్పుడు ఈమె పోస్ట్ చేసిన ఓ వీడియో చిక్కులు తీసుకొచ్చింది. అదే పోలీసుల నోటీసుల వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిపోయి.. చివరికి పోలీసుల వరకు వెళ్లింది.

అసలేం జరిగిందంటే ఈ భామ సరిలేరు నీకెవ్వరు సినిమాకు వెళ్లింది. బెంగళూరులో ఓపెన్ టాప్ కారులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి వెళ్లేటప్పుడు ఊరికే ఉండకుండా సెల్ఫీ వీడియో తీసింది. అందులోనూ ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తుంది. అలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తూ వీడియో తీసినందుకు గానూ ఈమెకు పోలీసులు ఫైన్ వేసారు. అందులో నాకు ఇష్టమైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి వెళ్తున్నాను.. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది.

మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అంటూ వీడియో పోస్ట్ చేసింది. అందులో సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటూ పోలీసులు ఆమెను లాక్ చేసారు. ఏదేమైనా కూడా ఉత్సాహం ఆపుకోలేక చేసిన పని ఇప్పుడు సంజన పీకల మీదకు తీసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here