Home Entertainment Cinema

సిగ్గు చిన్నప్పుడే విడిచేసింది! పూనంపాండే

బట్టలిప్పి బజార్నపడింది పూనంపాండే. ఎక్స్‌పోజింగ్‌ అనేసరికి పూనకమొచ్చేస్తుంటుంది పూనంపాండేకి. తనకేదీ సీక్రెట్‌కాదు. బాత్రూం బాతింగ్‌ నుంచి బెడ్‌రూం రొమాన్స్‌ దాకా ప్రతీదీ అందరితో షేర్ చేసుకోవడమే ఆ బ్లాక్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ డ్యూటీ. ఎప్పుడూ ఏదో ఒక వివాదాల్లో ఉంటేనే తనకు మనశ్శాంతి. గోవా అంటేనే బీచులు, బికినీలు, పబ్బుల గబ్బులు. చివరికి వాళ్లకు కూడా వామ్మో ఏంటి ఎక్స్‌పోజింగ్‌ అనిపించేలా…సీ షోర్‌లో బరితెగించేసింది పూనంపాండే. గోవాలో మొన్ననే ఓ షూట్ పూర్తి చేసి ముంబైకి తిరిగొచ్చింది పూనం. ఆమె అక్కడ ల్యాండ్‌ అయ్యేలోపే గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగంతో పాటు గోవా స్థానికులు పూనంపై కంప్లయింట్‌ చేశారు. న్యూసెన్స్‌ కేసుపెట్టి పోలీసులు పూనంపాండేని అదుపులోకి తీసుకున్నారు.

Poonam Pandey

గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనంపాండే షూటింగ్‌ వివాదానికి కారణమైంది. ఏ సిన్మా షూటింగో, మామూలు యాక్టింగో అయితే జనం కూడా ఎంజాయ్‌ చేసేవాళ్లే. అమ్మడు చేసింది పోర్న్‌ వీడియోనంటున్నారు. పోనీ అది కూడా చాటుమాటుగా కాదు. అందరిముందే బట్టలిప్పేసి నగ్నంగా వీడియో షూట్ చేసింది పూనం. అక్కడున్న మత్స్యకారులకు ఫ్రీ షో చూపించేసింది. దీంతో పోలీసులు కేసు బుక్‌చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. పూనం పాండేకి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా సహకరించారనే ఆరోపణలపై ఎంక్వయిరీ నడుస్తోంది. వివాదాల్లో ఉంటేనే పదిమందిలోతన పేరు నానుతుందని అనుకునే పూనం పాండేకి ఇలాంటి కేసులో లెక్కా…దీన్ని కూడా ఎంజాయ్‌చేస్తోంది.

అన్నట్లు ఈ మధ్యే మెళ్లో మూడుముళ్లేయించుకుంది పూనంపాండే. బాయ్‌ఫ్రెండ్‌ సామ్‌బాంబేని పెళ్లిచేసుకుంది. హమ్మయ్య.. పెళ్లయ్యింది కాబట్టి ఇక కుదురుగా ఉంటుందనుకుంటే అలవాటైనదాన్ని అలాగెలా వదిలేస్తానంటూ మళ్లీ బజార్నపడింది పూనం. పెళ్లయిన వారానికే మొగుడు టార్చర్‌ పెడుతున్నాడంటూ వదిలేసినంత పనిచేసింది. పెళ్లి పెటాకులైనట్లే అనుకుంటే…రెండ్రోజుల్లోనే మళ్లీ ప్యాచప్‌ జరిగిందని చెప్పేసింది. ఇప్పుడేమో గోవా గొడవ. వయసుడిగేదాకా పూనం పూనకం తగ్గేలా లేదు చూస్తుంటే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here