Home Entertainment Cinema

పవన్ సినిమాకే నో చెప్తావా.. ఆ హీరోయిన్ తో ఆడుకుంటున్న అభిమానులు..

ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు అందరికీ పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా అని ఉంటుంది. ఆయనతో అవకాశం వచ్చే రోజు కోసం వేచి చూస్తుంటారు చాలా మంది హీరోయిన్లు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తో నటించడం అని చెబుతారు. పవర్ స్టార్ అంటే అంత క్రేజ్ ఉంటుంది. అలాంటి హీరో పిలిచి అవకాశం ఇస్తే వద్దనుకునే హీరోయిన్లు అసలు ఉంటారా.. అంత సాహసం ఎవరు చేస్తారు అనుకుంటున్నారు కదూ.

Pooja Hegde
Pooja Hegde

ఇప్పుడు ఒక హీరోయిన్ చేసింది.. ఆమె మరెవరో కాదు పూజా హెగ్డే. తెలుగులో వరుస విజయాలతో టాప్ హీరోయిన్ రేంజ్ లో ఉన్న పూజా హెగ్డే.. పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వస్తే వదిలేసుకుందని ప్రచారం జరుగుతోంది. పవన్ ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇందులో హీరోయిన్ కు చాలా చిన్న పాత్ర ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అతిథి పాత్ర మాత్రమే. ఇలాంటి క్యారెక్టర్ కు తనను ఎంపిక చేసుకోవడంతో.. హీరో పవన్ కళ్యాణ్ అయినా కూడా చేయలేనని చెప్పేసింది పూజా హెగ్డే. పైగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజ.. ఇలాంటి అతిథి పాత్ర కోసం తన డేట్స్ కేటాయించలేనని చెప్పినట్లు తెలుస్తుంది.

దాంతో ఇప్పుడు పవన్ కోసం మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే పవన్ సినిమాలో అవకాశం వదిలేసుకున్న పూజా హెగ్డేతో ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. పవర్ స్టార్ అవకాశం ఇస్తే కూడా వదిలేసుకుంటావా.. ఎంత ధైర్యం నీకు అంటూ పవర్ స్టార్ అభిమానులు పూజా హెగ్డేని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కూడా పవన్ సినిమాను వదులుకొని పూజా హెగ్డే తీసుకున్న నిర్ణయం మాత్రం నిజంగా ఒక సాహసమే.