Home Entertainment Cinema

విజయ్ రాజకీయాలు.. వణికిపోతున్న పొలిటికల్ పార్టీస్..

తమిళనాట రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. అక్కడ ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చేశారు. లోకనాయకుడు ఏకంగా పోటీ కూడా చేశాడు. అయితే ఫలితం లేకుండా పోయింది. ఇక రజనీకాంత్ కూడా త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగిపోవాలని ఆలోచిస్తున్నాడు. ఇలాంటి సమయంలో మరో సూపర్ స్టార్ విజయ్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని తమిళనాట జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో బిజీగా ఉండే విజయ్ ని కొన్ని రాజకీయ పార్టీలు..

Tamil Hero Vijay

కొందరు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. సినిమాలు చేసుకునే ఆయన్ని కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు అభిమానులు. మొన్నటికి మొన్న ఈయనపై జరిగిన ఐటీ దాడుల వెనుక కూడా రాజకీయ కుట్ర ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆయన మాస్టర్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా వెళ్లి అధికారులు ఆయనను తీసుకురావడం.. మూడు రోజులపాటు ఐటి సోదాలు చేయడం..

విజయ్ ఫైనాన్షియర్ ఇంట్లో 65 కోట్ల డబ్బు దొరకడం ఇవన్నీ సంచలనం సృష్టించాయి. అయితే తనకు సంబంధం లేని విషయంలో కావాలని తనను లాగి ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తున్నారని విజయ్ మండిపడుతున్నాడు. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చిన పార్టీకి తాను తలవంచి నిలబడలేదని రాజకీయ కామెంట్ కూడా చేశాడు దళపతి. అభిమానుల అండదండలు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు విజయ్. ప్రస్తుతం లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న మాస్టర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడని కొందరు మాట్లాడుతున్నారు.. కానీ ఆయనకు సినిమాలు తప్ప ప్రస్తుతం రాజకీయాలు చేసే ఉద్దేశం లేదు అంటూనే సన్నిహితులు చెబుతున్నారు. మరో పదేళ్ల వరకు ఆయనకు సినిమాలే ప్రపంచం అంటున్నారు వాళ్లు. అయితే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాకపోయినా కూడా ప్రజలకు సాయం చేసే విషయంలో మాత్రం తనవంతుగా విజయ్ ముందు ఉంటాడని వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇప్పుడే నీకు రాజకీయాలు వద్దు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది.. అని విజయ్ కు ప్రత్యేకంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా తమిళనాట రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ అర్థం చేసుకోలేరు. అందులో అనవసరంగా విజయ్ ని టార్గెట్ టార్గెట్ చేస్తున్నారు అంటూ బాధ పడుతున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here