Home News Politics

పోలవరంలో పవన్ బోటు షికారు…!

పోలవరంలో బోటు షికారు చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రజాపోరాట యాత్ర లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ కాసేపు గోదావరి ఒడ్డున సేద తీరారు. అంతకు ముందు పోలవరంలో పంచాయతీ సర్పంచ్ లతో భేటీ అయ్యారు. ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలేదని ఫైరయ్యారు.

ప్రజలకు అండగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ తెలంగాణ ఎన్నికల్లో పోటి చేయాల వద్ద అన్నది వారంలో డిసైడ్ చేస్తా అన్నారు. ఈ సందర్భంగా జనసేనాని తెలంగాణ నుంచి వచ్చిన నేతలతో ఎన్నికల పై చర్చించారు.

అయితే గోదావరి నది లో బోటింగ్ చేసిన పవన్ కళ్యాణ్..బోట్ లో వున్నంతసేపు అటు ఆయన కాని ఇటు సిబ్బంది కానీ ఎవ్వరూ లైఫ్ జాకెట్ వేసుకోకపోవడం‌పై చర్చ జరుగుతోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here