Home News

    బ్రేకింగ్: వ్యాక్సినేషన్ పై మోడీ కీలక ప్రకటన..జూన్21 నుంచి అందరికి ఫ్రీ వ్యాక్సిన్

    కరోనా సంక్షోభం,వ్యాక్సినేషన్ పై జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ కీలక ప్రకటన చేశారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. రాష్ట్రాలకి ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించిన మోడీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. . కరోనా అనేది శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విపత్తు అని.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీరుస్తున్నామన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువ అని.. మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేందని గుర్తు చేశారు.

    జూన్ 21 నుంచి రాష్ట్రాలకు ఉచిత వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు ప్రధాని. వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇచ్చే విషయంపై కేంద్రం తీరును వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించడంతో మోదీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఆరు కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం పిల్లలపైన టీకా ప్రయోగాలు జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్లపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయన్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here