Home Health corona

కరోనా పై సమీక్ష సమావేశంలో పీఎం మోడీ ఉద్వేగం

భారత్‌ పై కరోనా మహమ్మారి అంతకంతకు పెరిగిపోతోంది. ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రస్తుతం దేశంలో దాదాపు రెండున్నర కోట్లకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. అమెరికా తర్వాత ఆస్థాయిలో భారత్ లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ​క్రమంలో కరోనా కేసుల పరిస్థితి, టీకా పంపిణీ కార్యక్రమంపై ప్రధాని మోడీ కీలక సమీక్ష నిర్వహించారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పడుతున్న బాధలపై శుక్రవారం జరిగిన సమావేశంలో మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎంత బాధకు గురవుతున్నారో తాను అంతే బాధను అనుభవిస్తున్నాను అంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఈ 100 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. కంటికి కనిపించని శత్రువు పై యుద్దం చేస్తున్నామని ప్రజలంతా స్వియనియంత్రణ పాటించాలన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 18 కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాబట్టి మీవంతు వచ్చినపుడు తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలి’ అని మోడీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here