ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. భూమండలాన్ని శాసించే అగ్రరాజ్యం. అలాంటి దేశానికి అధ్యక్షుడు కావడమంటే మాటలుకాదు. అమెరికా అధ్యక్షుడిగా ఓ టర్మ్ పదవిలో ఉన్నా ఆ గుర్తింపే వేరు. ట్రంప్ శకంముగిసింది. చేసుకోవడానికి బోలెడు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి కొన్నాళ్లు రాజకీయాలు పక్కనపెట్టి బిజినెస్ చూసుకునే ఛాన్సుంది. కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ట్రంప్ కి ఉన్నా.. అమెరికా మాజీ అధ్యక్షుడికి ప్రభుత్వపరంగా ఎలాంటి సదుపాయాలు ఉంటాయనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం. మిగిలిన దేశాలతో పోలిస్తే అమెరికాలో…మాజీ అధ్యక్షుడికి సదుపాయాలు, చెల్లింపులు ఘనంగానే ఉంటాయి. అధ్యక్షుడికి, ఆయన కుటుంబసభ్యులకు ప్రొటోకాల్ ప్రకారం అనేక వసతులు సమకూరుతాయి. అధ్యక్షుడి పదవీ కాలం ముగిసిందంటే.. వైట్‌హౌస్ విడిచిపెట్టి వెళ్లాల్సిందే. మరో ప్రాంతంలో సొంతంగా ఆఫీస్, నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్నాక 7 నెలల పాటు మాజీ అధ్యక్షుడి కొత్త ఆఫీసు అద్దె, టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రింటింగ్, పోస్టల్ సేవలు తదితరాలకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ పింఛను మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఈ పింఛన్ 2లక్షల 19వేల 200 డాలర్లు. భారతీయ కరెన్సీలో సుమారు కోటీ 60 లక్షలు. ఇది ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగుల జీతంతో సమానం. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా, తట్టాబుట్టా సర్దుకున్నాక ఈ పింఛన్ పొందుతారు. అయితే దానికింకా రెండు నెలల టైం ఉంది. అమెరికా నిబంధనల ప్రకారం 2021 జనవరి 20న అర్ధరాత్రికల్లా అధికార బదిలీ జరుగుతుంది. మరుక్షణం నుంచి ట్రంప్ మాజీ అధ్యక్షుడు అవుతారు.
Video Story:
మాజీ అధ్యక్షుడికే కాకుండా ఆయన భార్యకి కూడా అమెరికా ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ పింఛను ఏడాదికి 20 వేల డాలర్లుగా ఉంది. అయితే.. అధ్యక్షుడి సతీమణికి పింఛన్ విషయంలో నిబంధనలు వర్తిస్తాయి. వారు మరే ఇతర చట్టబద్ధమైన పింఛన్ల లబ్ధిదారులై ఉండకూడదు. లేదా అప్పటికే వేరే పింఛన్ ఉంటే దాన్ని వదులుకోవాలి. మాజీ అధ్యక్షుడు, ఆయన జీవిత భాగస్వామి పింఛన్ పై ఏటా సమీక్ష జరుగుతుంది. దానికి అనుగుణంగా పింఛన్ మొత్తంలో మార్పులు జరుగుతాయి. అమెరికా మాజీ అధ్యక్షులకు పింఛన్ ప్రక్రియ వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. మొదట్లో అమెరికాలో మాజీ అధ్యక్షులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కావు. 1912లో ఆండ్రూ కార్నెగీ అనే పారిశ్రామికవేత్త అమెరికన్ మాజీ ప్రెసిడెంట్లకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ కాలంలోనే ఏటా 25 వేల డాలర్ల పింఛను ఇస్తానని ప్రకటించారు. అగ్రరాజ్య అధినేతలుగా ఉండి పదవినుంచి తప్పుకున్నవారికి బయటివారు సాయం చేయడం అవమానకరమని ప్రభుత్వం పింఛను ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. 1958లో ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం.. మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం పింఛను ఇస్తుంది. దీంతో పాటు ఆయనకు కేటాయించిన భద్రతా సిబ్బంది, ఇతర సిబ్బంది జీతభత్యాలు, హెల్త్ ఇన్సూరెన్స్ కు నిధులు కేటాయిస్తుంది. మాజీ అధ్యక్షులు తాము అధికారంలో ఉండగా ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రెసిడెన్షియల్ మెమొరీస్ పేరుతో రాసే ఆత్మకథల హక్కులను కొన్ని ప్రచురణ సంస్థలు కొనుగోలుచేసి పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. ప్రభుత్వమిచ్చే పింఛనుకు అది అదనపు ఆదాయం.
అధ్యక్షుడితో పాటు మాజీ అధ్యక్షులకు కూడా మిలటరీ ఆసుపత్రుల్లోనే వైద్యసేవలు అందిస్తారు. అయితే.. దీనికోసం నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మాజీ అధ్యక్షులకు వ్యక్తిగత ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం రహస్యంగా భద్రత కల్పిస్తుంది. అధ్యక్షుడిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు నచ్చనివారు, శత్రుత్వం పెంచుకున్నవారు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని…ముందుజాగ్రత్తగా మాజీ అధ్యక్షులకు, వారి కుటుంబసభ్యులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. 1965 నుంచి 1996 వరకు జీవితకాలం భద్రత కల్పించే చట్టం అమల్లో ఉండేది. 1997లో దాన్ని పదేళ్లకు కుదించినా… ఒబామా అధికారంలో ఉండగా మళ్లీ జీవితకాలానికి పెంచుతూ చట్టం చేశారు. ఏనుగు బతికున్నా చచ్చినా విలువ తగ్గదన్నట్లు…అమెరికాలో పదవినుంచి దిగిపోయాక కూడా రాజభోగాలకు మాత్రం కొదవ ఉండదు.
చనిపోయేవరకు అధికారపార్టీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కుమారుడిని వ్యూహాత్మకంగా దుబ్బాక బరిలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. వివాదరహిత నాయకుడిగా దుబ్బాకలో ముత్యంరెడ్డికి మంచి పేరుంది. ఆయన్ని టీఆరెస్ అవమానపరిచిందని, కనీస గౌరవం ఇవ్వలేదని ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి. అటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తనకున్న స్థానబలంతో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదంత టెంపో తీసుకొచ్చారు రఘునందన్. పార్టీ ముఖ్యనేతలంతా మోహరించడం, పోలీసుల దాడుల వివాదంలో స్వయానా కేంద్రమంత్ర కిషన్ రెడ్డి దుబ్బాకకి రావడం బీజేపీ శ్రేణులను మరింత ఉత్సాహపరిచింది. ఇక దివంగత నేత సతీమణిగా కేవలం సెంటిమెంటుని, అధికారపార్టీ బలాన్ని నమ్ముకుని బరిలోకి దిగారు సుజాత. పేరుకు రామలింగారెడ్డి భార్య బరిలో ఉన్నా…అభ్యర్థిని తానేనన్నంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి హరీష్ రావు. మొత్తానికి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా దుబ్బాక ఫలితం తెలంగాణలో సరికొత్త సమీకరణాలకు తెరలేపబోతోంది. గెలిస్తే సరిపోదనే విషయం టీఆరెస్ పార్టీకి తెలుసు. గత ఎన్నికల్లో వచ్చినమెజారిటీ ఏమాత్రం తగ్గినా…విపక్షాలు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలోకి దూకుతాయి. అందుకే దుబ్బాక ఫలితాలకోసం రాజకీయపక్షాలతోపాటు సామాన్యులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు