Home News

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మిస్సింగ్..ఆ ఇద్దరు మంత్రులకు ముందే తెలుసా

పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మిస్సింగ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన మధు వారం రోజులుగా ఎవరికి అందుబాటులో లేరు. అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్టామధు పేరు ప్రముఖంగా వినిపించడం ఆ తర్వాత ఈటల ఎపిసోడ్ లోనూ మధు హస్తం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఆచూకీ పై సస్పెన్స్ నెలకొంది. అయితే మధు అదృశ్యం పై ఇద్దరు మంత్రులకు ముందే సమాచారం ఉందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూ వివాదం మొదలైనప్పటి నుంచే పుట్ట మధు ఆచూకీ లేదని తెలుస్తుంది. ఆయనకు సెక్యూరిటీగా ఉన్న నలుగురు పోలీసులు సైతం అందుబాటులో లేరని తెలుస్తుంది. అయినా ఈ విషయం పై పోలీసులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ, కుమారుడు ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలిసేందుకు చేసిన ప్రయత్నించగా అపాయింట్ మెంట్ లభించనట్లు తెలుస్తుంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసి తన భర్త ఆచూకీ పై ఆందోళన వెలిబుచ్చినట్లు తెలుస్తుంది.

వారం రోజుల క్రితం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయాన్ని సాక్షాత్తూ టీఆర్‌ఎస్‌ నేతలే ధ్రువీకరిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చిన పుట్ట మధు టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వామన్‌రావు హత్య కేసుతోపాటు ఈటల రాజేందర్‌ వ్యవహారంలో కూడా తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్‌కు చెప్పించేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఇద్దరు ఈ విషయలో రాయబారం నడిపారట. మరి ఈ హైడ్రామాకి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here