Home News Stories

ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీక్ నెస్-ఫ్యాన్ పార్టీకి ప్లస్…!

కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తి వీక్ నెస్ ప్రత్యర్ధికి ప్లస్ అవుతుంది … అలాంటి ఛాన్స్‌ దక్కితే విపక్షాలకు నిజంగా పండుగే .. ఇప్పుడు అదే జరిగే పరిస్థితి కనిపిస్తోందక్కడ .. అక్కడి సిట్టింగ్‌ అనుకున్నంత స్దాయిలో పని చేయకపోయినా పార్టి పవర్ లో ఉండటంతో ఇప్పటి వరకు నడిచిపోయింది .. మళ్లీ ఎన్నికలు రావడంతో సదరు ఎమ్మెల్యే ఎదురీదాల్సి వస్తోందంట … గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది..?

గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం … ఇప్పటి వరకు అక్కడ అధికార పార్టికి తిరుగులేదు… ఎమ్మెల్యేగా గెలుపొందిన కొమ్మాలపాటి శ్రీధర్ పార్టీ ఇమేజ్‌తో ఇంతకాలం నెట్టుకొచ్చేశారు .. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఏం సాధించారనేది పక్కన పెడితే … గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ .. సొంత కులానికి ప్రాధాన్యత ఇవ్వడంతో సొంత పార్టిలోనే ఆయనపై అసంతృప్తి తారా స్దాయికి చేరినట్లు కనిపిస్తోంది .. ఆ క్రమంలో సొంత కులంలోనే గ్రూపు రాజకీయాలు పెరిగిపోవటంతో .. ఇప్పుడు అది ఆయన గెలుపు పై ప్రభావం చూపించే పరిస్థితి .. నియోజకవర్గంలో అభివృద్ది జరిగీ జరగనట్లు కనిపిస్తుండటం కూడా ఆయనపై రిఫ్లెక్ట్‌ అవుతుందంటున్నారు ..

కృష్ణానది పై మరో బ్యారేజి నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేయటం, పనుల కూడా వేగవంతంగా జరుగుతున్నా అది ఎమ్మెల్యేకి ప్లస్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు .. గడిచిన ఎన్నికల్లో నియోజకవర్గంలో వన్ సైడ్ గా జరిగిన పోరులో టీడీపీ జెండా రెప రెపలాడింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి.. ఎమ్మెల్యే పని తీరు, వ్యవహర శైలి డిఫరెంట్ గా ఉంటూ వచ్చాయి .. ఆయన తీరుపై సొంత పార్టిలోని నేతలే విమర్శలు ఎక్కుపెడుతున్నారు … తను అనుకున్న వ్యక్తులకే ఆయన పెద్దపీట వేస్తూ వచ్చారు … దాంతో ఆటోఎమెటిక్ గా గ్రూపులు ఏర్పడి… పరిస్థితి మెదటికే మోసం వచ్చిపడ్డట్లు తయారైంది .. పార్టిలోని సీనియర్లను కూడా లెక్కచేయకుండా … వారి పై వెటకారంగా సెటైర్లు వేయటంతో పాటుగా చిన్న చూపు చూశారనే ముద్ర పడింది ..

కొమ్మాలపాటి శ్రీధర్‌ తన అనుచరుల్లో ఒక వర్గానికి పెద్ద పీట వేసి … ఇసుక, మట్టి దందాలు అప్పగించారన్న ఆరోపణలున్నాయి … అలా ఒకే వర్గానికి ప్రోత్సాహకాలు ఇవ్వటంతో మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తికి కారణం అయ్యింది.. అదే అదునుగా ప్రతిపక్ష నేతలు ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పడం మొదలుపెట్టారు ..
పెద్ద కూరపాడు నియోజకవర్గం వైసిపి ఇన్‌ఛార్జ్‌గా కావటి మనోహర్‌నాయుడును మొదట్లో నియమించారు … అయితే పీకే సర్వే ఫలితాలతో మనోహర్ ను తప్పించి … నంబూరి శంకర్ రావును తెరమీదకు తెచ్చింది వైసీపీ … స్దానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శంకర్ రావు ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన నాయకుడు.. ఆయనకు ఎమ్మెల్యే సన్నిహితులతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. టీడీపీలోని అసంతృప్తులతో ఆయన ఇప్పటికే టచ్లో ఉన్నారు …

గుంటూరు పశ్చిమ నుండి మోదుగుల వేణుగోపాల రెడ్డి పార్టీకి రాజీనామా చేయటంతో ఆయనకు మద్దతుగా నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ షరీఫ్ మస్తాన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన తన అనుచరులతో కలసి నంబూరి శంకరరావు సమక్షంలో వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు.. ఇంకా టీడీపీలో బయటపడని అసంతృప్తి నేతులు పలువురు ఉన్నారంటున్నారు .. అలాంటి వారి వల్లే పార్టీకి ఇబ్బంది అవుతున్న ఆందోళన వ్యక్తం అవుతోంది పసుపు శ్రేణుల్లో …టీడీపీలో ఇలాంటి పరిస్థితిపై పక్కాగా లెక్కలు వేసుకొని ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన
నేతను ప్రత్యర్దిగా నిలబెట్టింది వైసీపీ.. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ పడుతుండటంతో పోటీ రసవత్తకరంగా మారింది … పెదకూరపాడు ఓటర్ల తీర్పు ఈ సారి ఎలా ఉంటుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here