Home News Politics

పవన్‌ ని రావోద్దన్న ఆ ఊరు…ఏలూరులో షాకిచ్చిన లంక గ్రామం

గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేనానికి అనుకోని షాక్ తగిలింది. ప్రజా పోరాటయాత్ర పేరుతో పశ్చిమలో పర్యటిస్తున్న జనసేనాని జిల్లాలో రాజకియ సెగలు రేపుతున్నారు. అరాచకాలు ఆపకపోతే కాళ్ళు విరిచి కుర్చోపెడతా అని ఎమ్మెల్యే చింతమనేనికి వార్నింగ్ ఇచ్చిన పవన్ కు ఏలూరు రూరల్ పర్యటనలో అనుకోని షాక్ తగిలింది.

ఏలూరు రూరల్‌ మండలం గుడివాక లంక గ్రామస్థులు పవన్ కళ్యాణ్ పర్యటనను బహిష్కరించారు. అంతేకాకుండా పర్యటనలో ఎవరైనా పాల్గొంటే 50 వేల జరిమానా కూడా విధిస్తామంటూ హెచ్చరించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది. కనీసం గ్రామంలో కూడా అడుగుపెట్టనివ్వమనడంతో పవన్ అక్కడ పర్యటించకుండానే వెనుదిరిగారు.

అధికార పార్టీ నేతలే టార్గెట్ గా విమర్షలు చేస్తున్న జనసేన అధినేత రెండో విడతగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్‌పై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీధి రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డ పవన్ రాజ్యాంగేతర శక్తులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గుండాయిజం చేస్తూ… రాజకీయం చేద్దామనుకుంటే ఖబడ్దార్ అంటూ చింతమనేనికి పరోక్ష హెచ్చరికలు చేశారు. చట్టాలు సక్రమంగా పనిచేస్తే రౌడీ ఎమ్మెల్యేలంతా జైల్లో ఉంటారన్నారు. ఆకు రౌడీలు, వీధి రౌడీలను పదహారేళ్ల వయసులోనే చూశానన్నారు. ఆడపడుచులతో అమర్యాదగా ప్రవర్తిస్తే కాళ్లు విరిచి ఇంట్లో కూర్చోపెడతామని చింతమనేని ప్రభాకర్ కి వార్నింగ్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అంతే ధీటుగా చింతమేని బదులిచ్చారు. తాను రౌడీనంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తనను నాణేనికి ఓ వైపే చూశారని, రెండో వైపు కూడా చూసి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కి దమ్ముంటే తన పై పోటీ చేసి గెలవాలని…నీ మీద గెలిచి అసెంబ్లీకి రాకపోతే మళ్లీ జనంలో కనిపించను అని సవాల్ విసిరారు. చావో రేవో దెందులూరులోనే తేల్చుకుందాం. నువ్వే పోటీకి రా! నువ్వు గెలిస్తే నేను ఊరొదిలిపెట్టి వెళ్తా. నేను గెలిస్తే షేక్‌ హ్యాండిచ్చి వెళ్లిపో అన్నారు. నేను గనుక పవన్‌వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చెయ్యలేరన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here