ప్రజా పోరాట యాత్రకి రంజాన్ వల్ల విరామం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాన్ తిరిగి ఈ నెల 26 నుంచి యాత్ర ని కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాన్ పర్యటించారు.
ప్రస్తుతం విశాఖలో ఉంటున్న పవన్ కళ్యాన్ 23వ తేదీన విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలతో కలుస్తారు. 25వ తేదీ వరకు విజయవాడలోనే జనసేనాధిపతి ఉంటారు. ఆ రోజు సాయంత్రం విశాఖ తిరిగి బయలుజేరతారు. 26వ తేదీ నుంచి విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జనసేన అధినేత ప్రజా పోరాట యాత్ర కొనసాగుతుంది.
ఇప్పటి వరకు జరిగిన యాత్ర సంతృప్తికరంగా సాగినట్లు జనసేన నేతలు భావిస్తున్నారు. ఇతర పార్తీలలాగా జనసమీకరణ చేపట్టకుండా ప్రజలు స్వతంత్రంగా వచ్చారని, వీరు వచ్చిన సంఖ్య అధికంగా ఉందని నేతలు అంటున్నారు. విశాఖ జిల్లాలో కూడా పవన్ కళ్యాన్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇప్పటికే వివిధ పార్టీల నేతలు పవన్ కళ్యాన్ కి టచ్ లో ఉన్నారు. సరైన సమయం తర్వాత భారీ వలసలు జనసేన లోకి ఉండే అవకాశం ఉందని అంటున్నారు.