Home Entertainment Cinema

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త లుక్..

పవన్ కళ్యాణ్ అంటే అంతే ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులు పండగ చేసుకుంటారు. అప్పటి వరకు అంచనాలు ఎలా ఉన్నా కూడా ఒకసారి ఆయన లుక్ రిలీజ్ అయిందంటే వాళ్ల ఆనందం అవధులు దాటిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇన్నిరోజులు టైటిల్ ఇదేనా కాదా అనే కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ కుర్చీ మీద కాళ్ళు చాపుకొని కూర్చొని.. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని.. పుస్తకం చదువుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతైనా పవన్ కళ్యాణ్ స్టైల్ ఎవరికి రాదు అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. మార్చి తొలి వారంలో ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇది పూర్తి అయిపోతే పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ సినిమా నుంచి ఫ్రీ అయిపోతాడు. మే 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే దీని పై అంచనాలు కాస్త తక్కువగానే ఉన్నాయి.. కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు బద్దలు అయిపోతాయి. ఇప్పుడు కూడా పింక్ సినిమా రీమేక్ విషయంలో ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు అభిమానులు. డిస్ట్రిబ్యూటర్లు కూడా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి వాళ్ల నమ్మకాన్ని పవర్ స్టార్ ఎంతవరకు నిలబడతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here